సుధీర్ చేస్తే తప్పు కాదు.. నేను చేస్తే తప్పేంటి.. రష్మీ ఎమోషనల్..!

సుధీర్ చేస్తే తప్పు కాదు.. నేను చేస్తే తప్పేంటి.. రష్మీ ఎమోషనల్..!
జబర్దస్త్ లో సుధీర్, రష్మీల జోడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ జోడి ఎన్ని స్కిట్ లు చేసిన అస్సలు బోర్ కొట్టదు.

జబర్దస్త్ లో సుధీర్, రష్మీల జోడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ జోడి ఎన్ని స్కిట్ లు చేసిన అస్సలు బోర్ కొట్టదు. ఇక వీరి వ్యక్తిగత విషయాల పైన అనేక సార్లు సోషల్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొట్టాయి. ముఖ్యంగా పెళ్లి గురించి అయితే లెక్కలేనన్ని సార్లు వార్తలు వచ్చాయి. అంతే స్థాయిలో వీరి పైన ట్రోలింగ్ కుడా నడుస్తుంటుంది. అయితే వీటిని పెద్దగా పట్టించుకోకుండా వారిపని వారు చేసుకుంటూ ఉంటారు సుధీర్, రష్మీ.

అయితే తాజాగా వర్షకి దైర్యం చెబుతూ ట్రోల్స్‌ను పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ రష్మీ ఎమోషనల్ అయింది. ఎక్స్‌ట్రా జబర్దస్త్ తాజా ఎపిసోడ్‌లో తనపై వస్తున్న ట్రోల్స్ గురించి వర్ష మాట్లడుతూ కాస్త ఎమోషనల్ అయింది. జబర్దస్త్ సెట్ లో వేరుగా ఉంటుంది బయట వేరుగా ఉంటుదని, ఇక్కడ ఉన్నంత గౌరవం బయట ఉండదని చెప్పుకొచ్చింది. ఇక ట్రోల్స్‌ పైన మాట్లాడుతూ.. తన తమ్ముడు ఫేస్ మీద ఫోన్ పెట్టి.. ఏంటక్కా ఇది అని అడిగితే తట్టుకోలేకపోయానని వర్ష ఏడ్చేసింది.

దీనిపైన రష్మీ మాట్లాడుతూ.. అమ్మాయిలు అబ్బాయిలు సమానం అని అంటారు కానీ అలా చూడరు. తాజాగా రీసెంట్‌గా నాది ఓ సినిమా ట్రైలర్ విడుదలైతే ఇందులో సుధీర్ ఉంటే బాగుంటుందని కామెంట్స్ చేశారు. పర్సనల్ లైఫ్ వేరు, ప్రోపెషన్ లైఫ్ వేరు. సుధీర్ ఎవరితోనైనా యాక్ట్ చేస్తే ఒప్పుకుంటారు.

కానీ నేను వేరే వాళ్లతో యాక్ట్ చేస్తే ఒప్పుకోరు. అది ఎందుకో అర్ధం కాదు. అబ్బాయిల ఎంత మందితోనైనా పులిహోర కలిపిన పర్వాలేదు.. కానీ అమ్మాయిలు క్యారెక్టర్ పరంగా వేరే వాళ్లతోని నటిస్తే ఒప్పుకోరు. ఇక ట్రోల్స్ విషయంలో వారు బ్రతికేది దానిమిదే అవి పట్టించుకోవద్దు అంటూ ఎమోషనల్ అయింది రష్మీ.

Tags

Read MoreRead Less
Next Story