తన భర్త నరసింహరెడ్డిని బెయిల్‌పై తీసుకొచ్చేందుకు యాంకర్ శ్యామల ప్రయత్నాలు?

చీటింగ్ కేసులో అరెస్ట్ అయిన నరసింహరెడ్డిని బెయిల్‌పై తీసుకొచ్చేందుకు యాంకర్ శ్యామల తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు కేసు పెట్టిన మహిళతోనూ కాంప్రమైజ్‌కి ప్రయత్నిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. నరసింహారెడ్డి జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత అందరికీ అమౌంట్ సెటిల్ చేస్తానని బాధితులకు యాంకర్ శ్యామల హామీ ఇస్తున్నట్లు తెలుస్తోంది.
యాంకర్ శ్యామల భర్త నరసింహారెడ్డిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు పోలీసులు. నరసింహారెడ్డిపై రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైంది. కోటి రూపాయలు తీసుకుని తిరిగి ఇవ్వకుండా తనను మోసం చేశాడని శ్యామల భర్త నరసింహారెడ్డిపై ఓ మహిళ కేసు పెట్టింది.
2017 నుంచి ఇప్పటి వరకు విడతల వారీగా డబ్బు తీసుకున్నాడని, తిరిగి ఇవ్వమని అడిగితే బెదిరించడమే కాకుండా.. తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదులో తెలిపింది. నరసింహారెడ్డిపై కంప్లైంట్ ఇవ్వడంతో.. ఓ మహిళను రాయబారానికి పంపి.. సెటిల్‌మెంట్‌కు ప్రయత్నించాడని కూడా పోలీసులకు తెలిపింది.
ఈ విషయమై కేసు నమోదు చేసుకున్న రాయదుర్గం పోలీసులు.. నరసింహారెడ్డితో పాటు రాయబారం నడిపిన మహిళను సైతం రిమాండ్‌కి తరలించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com