అదంతా ఉత్తిత్తే... అసలు విషయం ఇదంటున్న స్టార్ యాంకర్లు..!

అదంతా ఉత్తిత్తే... అసలు విషయం ఇదంటున్న స్టార్ యాంకర్లు..!
ఇప్పుడు బుల్లితెర పైన ఎంటర్టైన్మెంట్ షోలు ఎక్కువైపోయాయి. ఈ షోలను కూడా ప్రేక్షకులు కూడా బాగానే ఆదరిస్తున్నారు.

ఇప్పుడు బుల్లితెర పైన ఎంటర్టైన్మెంట్ షోలు ఎక్కువైపోయాయి. ఈ షోలను కూడా ప్రేక్షకులు కూడా బాగానే ఆదరిస్తున్నారు. అయితే ఎపిసోడ్ పైన కాస్తా హైప్ తీసుకొచ్చేందుకు షో నిర్వాహకులు ప్రోమోలను కాస్తా ఇంట్రెస్టింగ్ గా ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే సింగర్ సునీత, ఆలీ, దర్శకుడు కృష్ణారెడ్డి జడ్జిలుగా సాగుతున్న 'డ్రామా జూనియర్స్' ప్రోగ్రామ్‌‌కి తాజా ప్రోమో సూపర్ పాపులారిటీ తెచ్చింది.

ఈ ప్రోమోలో యాంకర్ శ్రీముఖి దేవకన్య లాగా ఎంట్రీ ఇచ్చి యాంకర్ ప్రదీప్‌‌కి ఐ లవ్ యూ అంటూ లవ్ ప్రపోజ్ చేసింది. దీనికి ప్రదీప్‌ కూడా సరే అన్నట్లుగా ముసిముసి నవ్వులు నవ్వుతూ కనిపించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారిపోయింది. ఈ ప్రోమోతో ఇద్దరి మధ్య ఉన్నది ఫ్రెండిష్‌ మాత్రమే కాదని, ఇంకా ఏదో ఉందని, వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొడుతున్నాయి.

అయితే దీనిపైన టీవీ5 సినిమా బృందం వారిని డైరెక్ట్ గా సంప్రదించగా అలాంటిది ఏమీ లేదని, కేవలం షో ప్రోమో కోసమే ఇది చేశామని ఇద్దరూ క్లారిటీ ఇచ్చారు. తాజా క్లారిటీతో ఈ శ్రీముఖి, ప్రదీప్ ప్రేమ, పెళ్లి అనే కాన్సెప్ట్ కి బ్రేక్ పడినట్టు అయింది.

Tags

Read MoreRead Less
Next Story