Bigg boss Telugu సీజన్ 5 లో హాట్ స్టెప్‌ల యాంకర్..రచ్చ మాములుగా ఉండదు!

Bigg boss Telugu సీజన్ 5 లో హాట్ స్టెప్‌ల యాంకర్..రచ్చ మాములుగా ఉండదు!
Bigg Boss Telugu 5 ‌‌కి ఆమెకు పిలుపు రావటంతో.. ఇప్పుడు తన హాట్ అందాలతో రచ్చ చేయడానికి రెడీగా ఉంది.

Bigg Boss Telugu 5 :

బుల్లితెరపై మరోసారి సందడి చేయడానికి బిగ్‌బాస్ రెడీ అవుతున్నాడు. తెలుగులో ఇప్పటికే నాలుగు సీజన్‌లు పూర్తిచేసుకున్న బిగ్‌బాస్.. సీజన్ 5కి అదిరిపోయే కంటెస్టెంట్‌లను సెలక్ట్ చేస్తున్నారు. అదేంటి మొన్నేకదే.. బిగ్ బాస్ షో అయిపోయింది.. మళ్లీ ఈ రచ్చ ఏంట్రా బాబు అని అనుకోకండి. ఎందుకంటే.. బిగ్ బాస్ ఈ సారి బుల్లితెరపై మరింత కొత్తగా రావటానికి తొందరపడుతున్నాడు.

బిగ్ బాస్ సీజన్ 1 2017, 1 జూలై 16 న స్టార్ అయింది. సీజన్1 లో ఎన్టీఆర్ హోస్ట్ చేశారు. ఇక రెండో సీజన్ 2018, జూన్ 10న ప్రారంభం అయింది. నాని హోస్ట్ చేశారు. ఇక 2019, జూలై 21న ప్రారంభమైన మూడో సీజన్‌ని నాగార్జున హోస్ట్‌ చేశారు. ఇక నాలుగో సీజన్ మాత్రం కరోనా లాక్ డౌన్ కారణంగా చాలా లేట్‌గా 2020, సెప్టెంబర్ 21న స్టార్ట్ అయింది. గత సీజన్‌ల మాదిరిగా జూన్, జూలై, సెప్టెంబర్ కాకుండా సీజన్‌5 ని ఏప్రిల్‌లో స్టార్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. ఈ నేపథ్యంలోనే కంటెస్టెంట్ల ఎంపికను కూడా మొదలుపెట్టేశారట. ఈ సీజన్‌లో కూడా సోషల్ మీడియాలో పాపులర్ అయిన సెలబ్రిటీల కోసం వేట ప్రారంభించారట. ఇప్పటికే 60 మంది లిస్ట్ ప్రిపేర్ చేసినట్లు టాక్.

బిగ్ బాస్ అంటేనే లవ్ ట్రాక్‌లు.. ఎఫైర్లు మస్ట్.. వీటితోనే రేటింగ్ దూసుకెళ్తుందని బిగ్ బిస్ నిర్వాహకులు అభిప్రాయపడుతుంటారు.అందుకే ఈసారి కూడా ఓ హాట్ యాంకర్‌ని రంగంలోకి దించుతున్నారు. సీజన్ 1లో అర్చన, సీజన్ 2 దీప్తి సునైనా, నందిని రాయ్, సీజన్ 3లో పునర్నవి.. సీజన్ 4లో మోనాల్ గజ్జర్ లాంటి కంటెస్టెంట్స్‌ను లవ్ ట్రాక్.. ఎఫైర్ల కోసమే రంగంలోకి దించి బిగ్ బాస్ ఆట ఆడించారని సోషల్ మీడియా కోడై కూసింది. ఇప్పడు కూడా ఇలాంటి రచ్చ చేయటానికి హాట్ యాంకర్ వర్షిణిని తీసుకువస్తున్నట్లు నెట్టింట్లో వైరల్ అవుతోంది.


గత నాలుగు సీజన్లు క్రేజ్ ఉన్న పాపులర్ యాంకర్స్‌ని బిగ్ బాస్ హౌస్‌కి తీసుకువస్తున్నారు. సీజన్ 2లో రన్నరప్‌గా నిలిచిన శ్రీముఖితో సహా.. దీప్తి, శ్యామల, శివజ్యోతి, శిల్పా చక్రవర్తి, నాగ జ్యోతి, జోర్దార్ సుజాత, ఇలా చాలా మంది యాంకర్స్ బిగ్ బాస్ హౌస్‌లో సందడి చేశారు. తాజాగా సీజన్‌ 5లో యాంకర్ వర్షిణి సందడి చేయడం ఖాయంగానే కనిపిస్తోంది. బిగ్ బాస్ నిర్వాహకులు ఇప్పటికే వర్షిణితో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.



యాంకర్ వర్షిణి బిగ్ బాస్ తెరపై వస్తుందన్న వార్త కొత్తేమీ కాదు.. ఎందుకంటే సీజన్ 2, 3, 4 లలో బిగ్ బాస్ వాళ్లు వర్షిణిని సంప్రదించారు. గత సీజన్‌ల్లో ఆమె ఎంట్రీ ఉంటుందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ ఆమెకు అప్పటికే కొన్ని కమిట్‌మెంట్స్ ఉండటం వల్ల బిగ్ బాస్‌కి వెళ్లే ఛాన్స్ మిస్ అవుతూ వచ్చింది. ఐదో సీజన్‌‌కి ఆమెకు పిలుపు రావటంతో.. ఇప్పుడు తన హాట్ అందాలతో రచ్చ చేయడానికి రెడీగా ఉంది.




Tags

Read MoreRead Less
Next Story