'బిగ్‌బాస్‌' ఎన్ని కోట్లిచ్చినా.. అలాంటి పనులు చేయను..: విష్ణుప్రియ కామెంట్స్

బిగ్‌బాస్‌ ఎన్ని కోట్లిచ్చినా.. అలాంటి పనులు చేయను..: విష్ణుప్రియ కామెంట్స్
సినిమాల్లో నటిగా రాణించాలంటే కావలసినవి ఏంటో చూపించేసింది.

బయట ఇంత అందమైన ప్రపంచం ఉంటే బిగ్‌బాస్ హౌస్‌‌లోకి వెళ్లి అన్ని రోజులు ఉండడం.. బాబోయ్ నావల్ల కాదు అంటోంది బుల్లి తెర యాంకర్ విష్ణుప్రియ. పోవేపోరాతో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైన విష్ణుప్రియ షోకి బ్రేక్ రావడంతో వెండితెరపై దృష్టి సారించింది. చెక్‌మేట్ సినిమాతో తన అదృష్టాన్ని చెక్ చేసుకోవడానికి సిద్ధపడింది. ఇటీవలే విడుదలైన ట్రైలర్‌లో సినిమాల్లో నటిగా రాణించాలంటే కావలసినవి ఏంటో చూపించేసింది. ఇక ఇంటర్వ్యూలో తన సినిమా ముచ్చట్లతో పాటు బిగ్‌బాస్‌పై కూడా కామెంట్ చేసింది విష్ణుప్రియ.

బిగ్‌బాస్ నాలుగవ సీజన్ ప్రారంభానికి ముందు ఆమె కూడా ఓ కంటెస్టెంట్‌గా కనిపించనుందని అప్పట్లో జోరుగా ప్రచారం సాగింది. ఇదే విషయాన్ని ఇంటర్వ్యూలో ప్రస్తావించగా సంచలన వ్యాఖ్యలు చేసింది విష్ణుప్రియ. తనకు బిగ్‌బాస్ అంటే అస్సలు నచ్చదని, ఎన్ని కోట్లిచ్చినా ఆ షోకి వెళ్లనని చెప్పింది. అయినా హౌస్‌లో ఏం ఉంటుంది.. ఒకరిని ఒకరు కొట్టుకోవడం.. తిట్టుకోవడం తప్పించి.. ప్రతి సారి గ్రూప్ నుంచి ఎవరినో ఒకరిని ఎలిమినేట్ చేయాలి. నా ఉద్దేశం ప్రకారం లైఫ్‌లో ఏ ఒక్కరినీ ఎలిమినేట్ చేయకూడదు.. వీలైతే ప్రేమించాలి కాని.. కేవలం డబ్బు కోసం అలాంటి పనులు చేయను.. అందుకే బిగ్‌బాస్ షోకి ఫ్యూచర్‌లో కూడా వెళ్లను అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది. ఈ విషయం రాసి పెట్టుకోండి.. ఒక వేళ వెళ్తే నన్ను బ్లేమ్ చేయండి అంటూ ‌చెప్పుకొచ్చింది విష్ణుప్రియ.

Tags

Next Story