ఈ రాజేంద్రప్రసాద్ హీరోయిన్ గుర్తుందా.. తెలుగులో ఒకే ఒక సినిమాతో ఫెడ్ అవుట్...!

ఈ రాజేంద్రప్రసాద్ హీరోయిన్ గుర్తుందా.. తెలుగులో ఒకే ఒక సినిమాతో ఫెడ్ అవుట్...!
హీరోయిన్‌‌‌‌గా రాణించాలని అనుకోని చాలా మంది అమ్మాయిలు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుంటారు. అయితే అందరికీ ఆ అదృష్టం ఉండకపోవచ్చు.

హీరోయిన్‌‌‌‌గా రాణించాలని అనుకోని చాలా మంది అమ్మాయిలు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుంటారు. అయితే అందరికీ ఆ అదృష్టం ఉండకపోవచ్చు. కొందరు హీరోయిన్‌‌‌గా క్లిక్ అయితే మరికొందరు మాత్రం.. ఒకటి రెండు సినిమాలకి పరిమితం అవుతుంటారు. ఇప్పుడు అలాంటి జాబితాలోకి వస్తుంది నటి దామిని. కన్నడలో స్టార్ హీరో కం డైరెక్టర్ ఉపేంద్ర నటించిన 'ఉపేంద్ర' సినిమాలో హీరోయిన్‌‌‌గా మొదటి ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాలో ఈ భామ పాత్ర కూడా బాగా ఎలివేట్ కావడంతో బాగానే ఆఫర్స్ వచ్చాయి. అయితే ఈ సినిమా తర్వాత ఆమె ఎంచుకున్న పాత్రలు, సినిమాలు ఆమె కెరీర్‌‌‌కి ఏ మాత్రం ఉపయోగపడలేదు. దీనితో ఆమెకి ఆఫర్స్ తగ్గిపోయాయి.

దీనికి తోడు ఆమె బాగా లావుగా ఉండడం, డైట్ విషయంలో కూడా శ్రద్ధ చూపించకపోవడంతో అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. సినిమాలు లేకున్నప్పటికీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ అభిమానులకి దగ్గరగా ఉండేందుకు ట్రై చేస్తుంటారు హీరోయిన్లు. కానీ దామిని సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టివ్‌‌‌గా ఉండటం లేదు. దీనితో ఆమె పూర్తిగా ఫెడ్ అవుట్ అయిపొయింది. తెలుగు, కన్నడ, మలయాళం, తదితర భాషలలో కలిపి దాదాపుగా 15కు పైగా చిత్రాలలో హీరోయిన్‌‌‌‌గా నటించింది దామిని.

కాగా తెలుగులో రాజేంద్రప్రసాద్ హీరోగా వచ్చిన అందగాడు సినిమాలో హీరోయిన్‌‌‌గా నటించింది. కానీ ఈ సినిమా ఆమెకి ఏ మాత్రం బ్రేక్ ఇవ్వలేకపోయింది. దామిని చివరగా కన్నడలో స్వతంత్ర పాల్య అనే చిత్రంలో నటించింది. ఇక దామిని సోమశేఖర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది.

Tags

Read MoreRead Less
Next Story