Anil Ravipudi: అనిల్ రావిపూడి, తమన్నా మధ్య గొడవ.. నిజమే అంటున్న దర్శకుడు..

Anil Ravipudi: సినిమా షూటింగ్స్ సమయంలో ఆర్టిస్టులకు, దర్శకుడు, నిర్మాతలకు మధ్య మనస్పర్థలు రాడవం సహజం. అయితే ఈ విషయాలన్నీ ఎంత గోప్యంగా ఉంచాలని ప్రయత్నించినా.. ఏదో ఒక విధంగా బయటికి వస్తూనే ఉంటాయి. తాజాగా 'ఎఫ్ 3' సినిమా సమయంలో తమన్నాకు, అనిల్ రావిపూడికి మధ్య కూడా అలాంటి ఓ గొడవ జరిగిందని వార్తలు వస్తున్నాయి. దీనిపై డైరెక్టర్ ఇటీవల క్లారిటీ ఇచ్చాడు.
వెంకటేశ్, వరుణ్ తేజ్ మల్టీ స్టారర్‌గా తెరకెక్కిన 'ఎఫ్ 3' సినిమా ఇటీవల థియేటర్లలో విడుదలయ్యింది. ఎఫ్ 2కు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని కూడా ప్రేక్షకులు బాగానే ఆదరించారు. ఇప్పటికీ ఈ సినిమా ఓటీటీ పోటీని దాటి మంచి వసూళ్లను రాబడుతోంది. అయితే ఈ మూవీ సక్సెస్ అయిన సందర్భంగా అనిల్ రావిపూడి బిజీగా ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నాడు. అలా ఒక ఇంటర్వ్యూలో తమన్నాతో జరిగిన గొడవ గురించి మాట్లాడాడు.
ఎఫ్ 3 సినిమా షూటింగ్ సమయంలో ఓ రోజు టైమ్ అయిపోయినా కూడా కాసేపు సెట్‌లోనే ఉండమని ఆర్టిస్టులను కోరాడట అనిల్ రావిపూడి. అయితే అదే సమయంలో తాను వర్కవుట్స్ చేసుకోవాలని, వెళ్లిపోవాలని తమన్నా చెప్పిందట. దీని వల్ల రెండ్రోజులు వారిద్దరి మధ్య సరిగ్గా మాటలు లేకపోవడం నిజమే కానీ అది పెద్ద గొడవేమీ కాదు అంటూ అనిల్ క్లారిటీ ఇచ్చాడు. అంతే కాకుండా ఆ విషయం మెల్లగా సర్దుబాటు అయిపోయిందని కూడా అన్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com