Anil Ravipudi: నెగిటివ్ కామెంట్స్‌కు డైరెక్టర్ అనిల్ రావిపూడి ఘాటు రిప్లై..

Anil Ravipudi: సినీ పరిశ్రమలో పనిచేస్తున్న ప్రతీ ఒక్కరు వారి కెరీర్‌లో ఏదో ఒక సమయంలో నెగిటివ్ కామెంట్స్‌ను, ట్రోలర్స్‌ను ఎదుర్కోవాల్సిందే. కానీ వాటిపై అందరూ ఎలా స్పందిస్తారు అనేది ముఖ్యం. కొందరు వాటిని పట్టించుకోకుండా ముందుకెళ్తుంటే.. మరికొందరు మాత్రం వాటన్నింటిని పట్టించుకుంటూ అక్కడే ఆగిపోతారు. తాజాగా అనిల్ రావిపూడి తాను నెగిటివ్ కామెంట్స్‌ను ఎలా తీసుకుంటాడో బయటపెట్టాడు.
తెలుగులో ఫుల్ లెన్త్ కామెడీ సినిమాలు వచ్చి చాలాకాలమే అయ్యింది. ప్రేక్షకులంతా వైవిధ్యభరితమైన కథలను ఇష్టపడుతుండడంతో మేకర్స్ కూడా డిఫరెంట్ కథలతోనే ముందుకొస్తున్నారు. కానీ వెంకటేశ్, వరుణ్ తేజ్ లాంటి ఇద్దరు హీరోలను పెట్టి 'ఎఫ్ 2', 'ఎఫ్ 3' వంటి రెండు సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించాడు. ఇదే క్రమంలో తాను ఎన్నో ట్రోలింగ్స్‌ను కూడా ఎదుర్కున్నాడు.
అయితే అందులో చాలావరకు ట్రోల్స్ తనవరకు వస్తున్నాయని అన్నాడు అనిల్ రావిపూడి. జీవితం చాలా విలువైందని. తన జీవితంలోని విలువైన రోజుని, ఆనందాన్ని.. వేరే వాళ్ల వల్ల స్పాయిల్ అవనివ్వనని అనిల్ చెప్పాడు. ఒకరిని కించపరచడంలోనే వేరొకరికి ఆనందం ఉంటుందని అన్నాడు. అందుకే తనను ఇష్టపడని వాళ్లు ఏం చేయాలనుకుంటారో చేసుకొని అన్నాడు అనిల్. అంతే కాకుండా తనను ఇష్టపడేవాళ్లు లక్షల్లో ఉన్నారని, వారు కోరుకునేది ఇచ్చే బాధ్యత తనపై ఉందని తెలిపాడు అనిల్ రావిపూడి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com