Anjali: అంజలి డెడికేషన్‌కు హ్యాట్సాఫ్..! కాలికి గాయమయినా..

Anjali: అంజలి డెడికేషన్‌కు హ్యాట్సాఫ్..! కాలికి గాయమయినా..
Anjali: నితిన్, అంజలి కలిసి ‘మాచర్ల నియోజకవర్గం’లో ‘రా రా రెడ్డి’ అనే పాటకు స్టెప్పులేశారు.

Anjali: ఎప్పటికప్పుడు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న కొత్త హీరోయిన్ల జోరు పెరిగిపోవడంతో సీనియర్ హీరోయిన్లకు గట్టి పోటీ ఎదురవుతోంది. అందుకే తెలుగమ్మాయిలు కూడా పరభాషా ఇండస్ట్రీలలోనే ఎక్కువగా సత్తా చాటుతున్నారు. అలా కోలీవుడ్‌లో తనదైన ముద్ర వేసుకున్న హీరోయిన్ అంజలి. ఇప్పుడు చాలాకాలం తర్వాత మరోసారి నితిన్ నటించిన 'మాచర్ల నియోజకవర్గం' కోసం ఓ స్పెషల్ సాంగ్‌కు స్టెప్పులేసింది ఈ తెలుగమ్మాయి.


అంజలి చివరిగా నటించిన సినిమా 'నిశ్శబ్ధం'. అనుష్క హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో అంజలి ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించింది. ఈ మూవీ ప్రేక్షకులకు పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోవడంతో అంజలికి మరో అవకాశం రాలేదు. కానీ ఇప్పటికే సరైనోడు సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి మెప్పించిన అంజలి.. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత నితిన్‌తో కలిసి ఓ మాస్ సాంగ్‌లో ఆడిపాడింది.

నితిన్, అంజలి కలిసి 'మాచర్ల నియోజకవర్గం'లో 'రా రా రెడ్డి' అనే పాటకు స్టెప్పులేశారు. ఇటీవల ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో మూవీ టీమ్ పాల్గొంది. నితిన్ నటించిన జయం సినిమాలోని రాను రాను అంటూనే పాట పల్లవి.. ఈ పాటకు యాడ్ చేయడం హైప్‌ను క్రియేట్ చేసింది. ఇకపోతే అంజలి కాలికి గాయమయినా కూడా ఈ సాంగ్ షూటింగ్‌లో పాల్గొందని నితిన్ బయటపెట్టాడు. అలాంటి సమయంలో కూడా తను ఫ్లోర్ మూమెంట్స్ చేస్తూ చాలా కష్టపడిందని అన్నాడు.Tags

Read MoreRead Less
Next Story