పుట్టినరోజు శుభాకాంక్షలు రత్నమాల

పుట్టినరోజు శుభాకాంక్షలు రత్నమాల
VS 11 నుంచి అంజలి ఫస్ట్ లుక్ రిలీజ్

ఏ హీరోయిన్ పుట్టినరోజు వచ్చిందంటే ఆ హీరోయిన్ కొత్త సినిమాలో లుక్కుని రిలీజ్ చేయటం పరిపాటిగా మారింది. ఇప్పుడు అంజలి వంతు వచ్చింది. ఈరోజు ఆమె పుట్టినరోజు సందర్బంగా ఆమె కొత్త మూవీ లుక్ ను మీడియాకు విడుదల చేశారు. యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌లో ఓ కొత్త చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ 11వ సినిమా ఇది. పాటల రచయిత కృష్ణ చైతన్య ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీకర స్టూడియోస్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. విలక్షణ నటి అంజలి ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తోంది. అంజలి పుట్టినరోజున ఆమె ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. సినిమాలో ఆమె మాస్ లుక్ లో రత్నమాలగా కనిపించనుంది. కెరీర్ ప్రారంభంలో సాఫ్ట్ రోల్స్ చేసిన అంజలి.. పలు ఫిమేల్ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ, వెబ్ సిరీస్ లోనూ నటించింది. ఏ పాత్రనైనా తన పెర్ఫామెన్స్‌తో నిలబెట్టగల ప్రత్యేకత ఆమె సొంతం. రొటీన్ కు భిన్నంగా మంచి పాత్రలను, స్క్రిప్ట్‌లను ఎంచుకుంటుడడంతో అంజలికి ప్రేక్షకులలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక ఇప్పటికే విడుదలైన విశ్వక్ సేన్ గంగామ్మ జాతర, రాగ్స్ టు రిచ్స్ పోస్టర్లు ఆకట్టుకున్నాయి. అంజలి పోస్టర్ తో సినిమాపై అంచనాలు మరిన్ని పెరిగాయి. ఓ క్రూరమైన వ్యక్తి, మరింత క్రూరంగా ఎలా మారాడానేది ఈ సినిమా కథ.యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు.

Tags

Read MoreRead Less
Next Story