Anjali: మరో స్పెషల్ సాంగ్‌లో తెలుగమ్మాయి.. యంగ్ హీరోతో స్టెప్పులు..
Anjali: ఈమధ్య స్పెషల్ సాంగ్స్ చేయడానికి హీరోయిన్లు కూడా ప్రత్యేకంగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే పూజా హెగ్డే, సమంతలాంటి వారు స్పెషల్ సాంగ్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అందుకే మరికొందరు నటీమణులు కూడా స్పెషల్ సాంగ్స్‌లో మెరవడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. తాజాగా తెలుగమ్మాయి అంజలి కూడా మరోసారి స్పెషల్ సాంగ్‌కు ఓకే చెప్పినట్టుగా తెలుస్తోంది.
తెలుగమ్మాయి అంజలి.. తెలుగులో చేసింది కొన్ని సినిమాలే అయినా.. ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్రల్లో నటించింది. ఓవైపు హీరోయిన్‌గా చేస్తున్న సమయంలోనే.. అల్లు అర్జున్‌తో కలిసి 'సరైనోడు' సినిమా స్పెషల్ సాంగ్‌కు స్టెప్పులేసింది. ఆ తర్వాత మళ్లీ స్పెషల్ సాంగ్స్ వైపు వెళ్లలేదు. తాజాగా ఓ యంగ్ హీరో కోసం మరోసారి స్పెషల్ సాంగ్ చేయడానికి సిద్ధమయ్యింది అంజలి.
హీరో నితిన్ కాస్త రూటు మార్చి పొలిటికల్ డ్రామాలో నటిస్తున్నాడు. అదే 'మాచర్ల నియోజకవర్గం'. ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కృతి శెట్టి, కేథరిన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేస్తున్నట్టుగా అంజలి స్వయంగా ప్రకటించింది. హాట్ లుక్‌తో ఉన్న ఓ పోస్టర్‌ను విడుదల చేసి పాటను త్వరలోనే విడుదల చేస్తామని చెప్పుకొచ్చింది.
❤️@actor_nithiin's #MacherlaNiyojakavargam 🔥
— Anjali (@yoursanjali) July 3, 2022
Song Announcement coming shortly! Stay tuned.. 💥🥁#MNVFromAug12th ✨@IamKrithiShetty @CatherineTresa1 @SrSekkhar #MahathiSwaraSagar @SreshthMovies @adityamusic pic.twitter.com/UkU1jw54Ib
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com