ఆ సినిమా కోసం నితిన్‌‌తో స్క్రీన్ టెస్ట్.. కానీ కమిట్ అవ్వని హీరోయిన్..!

ఆ సినిమా కోసం నితిన్‌‌తో స్క్రీన్ టెస్ట్.. కానీ కమిట్ అవ్వని హీరోయిన్..!
సినిమా ఇండస్ట్రీలో చాలా విచిత్రాలు జరుగుతుంటాయి. పలానా కథను పలానా హీరోహీరోయిన్‌‌లతో అనుకోని మరొకరితో చేస్తుంటారు దర్శకులు.

సినిమా ఇండస్ట్రీలో చాలా విచిత్రాలు జరుగుతుంటాయి. పలానా కథను పలానా హీరోహీరోయిన్‌‌లతో అనుకోని మరొకరితో చేస్తుంటారు దర్శకులు.. ఇది సహజమే.. అయితే ఆ సినిమా ప్లాప్ అయితే పర్వాలేదు కానీ.. ఒకవేళ బ్లాక్‌‌బస్టర్ హిట్ అయితే మాత్రం ఆ సినిమాని మిస్ చేసుకున్న హీరోహీరోయిన్లు చాలా బాధపడుతుంటారు. అలా ఓ బ్లాక్‌‌బస్టర్ మూవీని మిస్ చేసుకున్న హీరోయిన్ లలో అన్షు ఒకరు. అన్షు అంటే టక్కున గుర్తుపట్టడం కష్టమే అనుకోండి. విజయభాస్కర్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా వచ్చిన మన్మధుడు సినిమాలో మహేశ్వరి అనే పాత్రలో నటించింది అన్షు.

ఆ సినిమాతో మంచి క్రేజ్ రావడంతో ఆ తరవాత వరుసగా అవకాశాలు వచ్చాయి. అందులో భాగంగానే నితిన్ హీరోగా, వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన దిల్ సినిమాలో హీరోయిన్‌‌గా అవకాశం వచ్చింది. స్క్రీన్ టెస్ట్ కూడా చేశారు. సెలెక్ట్ కూడా అయింది. కానీ ఆ సినిమాని ఎందుకో అన్షు వదులుకుంది. దీనికి సంబంధించిన స్క్రీన్ టెస్ట్ ఫోటోలను ఇన్‌‌స్టా‌‌గ్రామ్‌‌లో పోస్ట్ చేసింది. బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమాని అన్షు ఒకవేళ చేసుంటే టాప్ హీరోయిన్లలలో ఒకరిగా ఉండేది అని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఈ సినిమాలో నేహ బాంబ్ హీరోయిన్ గా నటించింది.Tags

Read MoreRead Less
Next Story