Ante Sundaraniki: ప్రేక్షకులకు సర్‌ప్రైజ్.. 'అంటే సుందరానికీ'లో మరో మలయాళ ముద్దుగుమ్మ..

Ante Sundaraniki: నేచురల్ స్టార్ నాని సినిమాలను ఎక్కువమంది ప్రేక్షకులు ఆదరిస్తారు. నాని కథ సెలక్ట్ చేసుకున్నాడంటే అది కచ్చితంగా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుందని ఇప్పటికే చాలామంది ఫిక్స్ అయిపోయారు. అందుకే జూన్ 10న విడుదలయ్యే 'అంటే సుందరానికి' చిత్రం కోసం ప్రేక్షకులు అంతలా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఆడియన్స్‌కు ఓ స్పెషల్ సర్‌ప్రైజ్ ఉందని టాక్ వినిపిస్తోంది.
అంటే సుందరానికీ చిత్రం కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ భాషల్లో కూడా విడుదలవుతోంది. ఇప్పటికే నజ్రియాను హీరోయిన్‌గా తీసుకోవడంతో మలయాళ ప్రేక్షకులకు ఈ మూవీపై ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది. అంతే కాకుండా ఇందులో మరికొందరు మలయాళ నటీనటులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా ఇందులో మరో మలయాళ ముద్దుగుమ్మ కూడా కీలక పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం.
అంటే సుందరానికీలో నజ్రియా హీరోయిన్‌గా నటిస్తుండగా.. అనుపమ పరమేశ్వరన్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. ట్రైలర్‌లో కూడా అనుపమను వెనక నుండి చూపించింది మూవీ టీమ్. ఈ పాత్ర కథలో చాలా కీలకం అని సమాచారం. సినిమా మొదటి నుండి చివరి వరకు ఈ పాత్ర ఉంటుందని రూమర్స్ ఫిల్మ్ సర్కిల్లో వైరల్ అయ్యాయి. ఇక నజ్రియా, అనుపమ వల్ల అంటే సుందరానికీకి మలయాళంలో కూడా మంచి పాపులారిటీ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com