Ante Sundaraniki Review: 'అంటే.. సుందరానికీ' మూవీ రివ్యూ.. నాని, నజ్రియాల క్యూట్ లవ్ స్టోరీ..
Ante Sundaraniki Review: గత కొద్దికాలంగా వరుస ఫ్లాఫ్లతో సతమతమవుతున్న నాని.. మరిసారి తన అదృష్టాన్ని పరిక్షించుకునేందుకు ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఈయన హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ "అంటే సుందరానికీ".. జూన్ 10న ప్రేక్షకుల ముందుకి వచ్చింది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాను దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కించారు. మలయాళ ముద్దుగుమ్మ నజ్రియా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్, సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతినిచ్చిందనేది ఇప్పుడు తెలుసుకుందాం.
కథ విషయానికి వస్తే.. సనాతన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన సుందరం బాల్యం నుండే పద్ధతులు, కట్టుబాట్ల మధ్య పెరుగుతాడు. ఈ క్రమంలో తను కోరుకున్న జీవితాన్ని, చిన్న చిన్న ఆనందాల్ని కోల్పోతాడు. అంతేకాదు సుందరానికి చిన్నప్పటినుండి అమెరికా వెళ్లాలనే కోరిక ఉంటుంది. దానికి కూడా తండ్రి ఆచారాల పేరుతో అడ్డుపడుతూ ఉంటాడు. ఈ క్రమంలోనే సుందరానికి లీలా థామస్ పరిచయం అవుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. లీలా క్రిస్టియన్ కావడంతో.. ఆమె పేరెంట్స్ మతపరమైన నమ్మకాల పట్ల చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. రెండు భిన్న మతాలకు చెందిన సుందరం, లీలా పెద్దలను ఒప్పించి తమ ప్రేమను ఎలా పెళ్ళిదాకా తీసుకెళ్ళారు అనేదే మిగతా సినిమా.
నిజానికి ఇలాంటి కథతో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. కథ పాతదే అయినప్పటికీ దర్శకుడు దాన్ని ప్రెసెంట్ చేసిన విదానం చాలా కొత్తగా ఉంది. ఓ రొటీన్ కథకు దర్శకుడు వివేక్ రాసుకున్న స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతాయి. ఆ విషయంలో దర్శకుడు ఫుల్ గా సక్సెస్ అయ్యాడు. ఇక సుందర్ పాత్రలో నాని నటన సినిమాకి హైలెట్ అని చెప్పాలి. కట్టుబాట్ల మద్య పెరిగిన యువకుడిగా నాని అద్బుతమైన నటనని కనబరిచాడు. లీలా పాత్రలో నజ్రియా క్యుట్ గా కనిపించి ఆకట్టుకుంది.
నాని, నజ్రియా మధ్య వచ్చే లవ్ అండ్ రొమాంటిక్ సన్నివేశాలు ప్రేక్షకులను ఫుల్ గా ఆకట్టుకుంటాయి. ఇక వివేక్ సాగర్ అందించిన పాటలు సో సో గా ఉన్నా.. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది. కెమెరా వర్క్, ఆర్ట్ వేర్క్ కూడా సినిమా మూడ్ కి తగ్గట్టుగా ప్లేసేంట్ గా ఉందని చెప్పాలి. అయితే సినిమా రన్ టైం ఎక్కువగా ఉండటం అనేది చిన్న డ్రాబ్యాక్ అనే చెప్పాలి. ఓవరాల్ గా అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ, కామెడి ఎంటర్టైనర్ గా వచ్చిన "అంటే సుందరానికి"తో ప్రేక్షకులను నవ్వుల పువ్వులు పూయిస్తుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com