Anupama Parameswaran: అనుపమపై హీరో ఆరోపణలు.. హీరోయిన్ స్పందన ఏంటంటే..?

Anupama Parameswaran: కలిసి సినిమా చేసి స్క్రీన్‌పై కెమిస్ట్రీ పండించినా కూడా కొందరు నటీనటులు ఆఫ్ స్క్రీన్ మాత్రం అంత ఫ్రెండ్లీగా ఉండరు. అయినా కూడా కలిసి చేసిన సినిమా ప్రమోషన్స్‌కు మాత్రం అందరూ నవ్వుతూ కనిపిస్తారు. ఇటీవల మూవీ టీమ్ అంతా కలిసి ప్రమోషన్స్‌లో పాల్గొనడం ఆనవాయితీగా మారిపోయింది. కానీ 'కార్తికేయ 2' ప్రమోషన్స్ సమయంలో మాత్రం అనుపమ ఎక్కడా కనిపించడం లేదు. దీనిపై నిఖిల్ స్పందించాడు.
నిఖిల్ కెరీర్‌లో 'కార్తికేయ' మూవీ మర్చిపోలేని హిట్‌ను ఇచ్చింది. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా తెరకెక్కిన కార్తికేయ 2.. ఆగస్ట్ 12న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. అయితే ఈ ప్రమోషన్స్‌లో డైరెక్టర్, హీరో తప్పా హీరోయిన్ ఎక్కడా కనిపించడం లేదు. దీనికి కారణం ఏంటని నిఖిల్‌ను ప్రశ్నించగా.. అనుపమ ప్రమోషన్స్‌కు ఎందుకు రాదో తెలియదని అందరినీ ఆశ్చర్యపరిచాడు. సెట్‌లో చాలా సరదాగా ఉండే తను షూటింగ్ అయిపోయాక మెసేజ్‌లకు, కాల్స్‌కు స్పందించదని చెప్పుకొచ్చాడు. అసలు తనేంటో అర్థం కాదని చెప్పాడు. తనకి రెండు ముఖాలున్నాయని అన్నాడు. రేపు ప్రమోషన్స్ ఉన్నాయని మెసేజ్ పెట్టిదని చూడదని ఆరోపించాడు.
నిఖిల్ చేసిన ఆరోపణలపై అనుపమ సోషల్ మీడియా ద్వారా స్పందించింది. 'కార్తికేయ ప్రమోషన్స్‌కు ఎందుకు రాలేకపోతున్నానో క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. నేను రాత్రి, పగలు తీరిక లేకుండా మరో రెండు సినిమాల్లో నటిస్తున్నాను. ఎప్పటినుండో దీనికి డేట్స్ కేటాయించాను. నాతో పాటు ఇతర ఆర్టిస్టుల డేట్స్ కూడా ఇప్పుడే ఉన్నాయి. మరోవైపు దురదృవషాత్తు కార్తికేయ విడుదలలో కూడా చాలా మార్పులు వచ్చాయి. దీంతో నాకు చాలా కష్టమయ్యింది. మీరందరూ నా కష్టాన్ని అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. కార్తికేయ కోసం అందరూ చాలా కష్టపడ్డారు. ముఖ్యంగా నిఖిల్ కాస్త ఎక్కువగా కష్టపడ్డాడు' అని ట్వీట్ చేసింది.
— Anupama Parameswaran (@anupamahere) August 1, 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com