DJ Tillu 2: 'డీజే టిల్లు' సీక్వెల్.. నేహా శెట్టి ప్లేస్‌లో మలయాళ ముద్దుగుమ్మ..

DJ Tillu 2: ఎన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నా.. నటీనటులు జీవితాన్ని మార్చేసే సినిమా ఒక్కటి ఉంటుంది. కొంతమందికి అది కెరీర్ బిగినింగ్‌లోనే వస్తే కొంతమంది ఆ ఒక్క స్పెషల్ సినిమా కోసం ఎన్నో సంవత్సరాలు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అలా యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డకు లైఫ్ ఇచ్చిన సినిమా 'డీజే టిల్లు'. ఇప్పుడు తనకు లైఫ్ ఇచ్చిన సినిమాకే సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడు సిద్ధు. కానీ మొత్తం కొత్త టీమ్‌తో.
'డీజే టిల్లు' సక్సెస్ తర్వాత సిద్ధు చాలా మారిపోయాడని, గర్వం పెరిగిందని చాలా రూమర్స్ టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్నాయి. అందుకే డీజే టిల్లు నుండి దర్శకుడు, హీరోయిన్ కూడా తప్పుకున్నారని గుసగుసలు వినిపించాయి. కానీ కారణం ఏదైనా డీజే టిల్లు సీక్వెల్ నుండి దర్శకుడు విమల్ కృష్ణ, హీరోయిన్ నేహా శెట్టి తప్పుకున్నారు. దీంతో ఓ మలయాళ ముద్దుగుమ్మ ఈ సీక్వెల్‌లో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసిందని టాక్ వినిపిస్తోంది.
ఇప్పటికే డీజే టిల్లు సీక్వెల్ షూటింగ్ ప్రారంభమయ్యింది. అయితే ఇందులో సిద్ధుతో మొదటిసారి జతకట్టడానికి సిద్ధమయ్యిందట అనుపమ పరమేశ్వరన్. డీజే టిల్లులో హీరో, హీరోయిన్ మధ్య రొమాంటిక్ సన్నివేశాలు కూడా చాలానే ఉంటాయి. అయితే రౌడీ బాయ్స్ చిత్రంతో తన రొమాన్స్ డోస్‌ను పెంచేసిన అనుపమ.. ఈ మూవీకి ఓకే చెప్పే ఉంటుంది అని ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు. ఈ విషయం తెలియాలంటే దీని గురించి అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com