ఆ వ్యక్తిని ఎంతో ఇష్టపడ్డాను. కానీ బ్రేకప్ అయింది : అనుపమ
అందం, అభినయం కలిస్తే అనుపమ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అ..ఆ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన ఈ మలయాళం బ్యూటీ.. ఆ తర్వాత శతమానం భవతి, హలో గురు ప్రేమ కోసమే, రాక్షసుడు మొదలగు చిత్రాలలో నటించి నటిగా మంచి పేరు తెచ్చుకుంది. . సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్‌గా ఉండే ఈ భామ తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో ముచ్చటించింది.
అందులో భాగంగా తన ప్రేమ పైన స్పందించింది. 'గతంలో నేను ప్రేమలో పడ్డాను. ఓ వ్యక్తిని ఎంతో ఇష్టపడ్డాను. కాకపోతే అది బ్రేకప్ అయిపోయింది' అని వెల్లడించింది. కానీ అతను ఎవరన్నది మాత్రం వెల్లడించలేదు. గతంలో అనుపమ బుమ్రాతో లవ్‌లో ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ అవేమి నిజం కాదని, బుమ్రా, తానూ మంచి స్నేహితులం అంటూ చెప్పుకొచ్చింది ఈ అమ్మడు.
ఇక ఇండస్ట్రీలో హీరో రామ్ పోతినేని తనకి మంచి స్నేహితుడని తెలిపింది. ప్రస్తుతం అనుపమ '18 పేజీలు', 'కార్తికేయ -2', 'రౌడీ బాయ్స్' అనే చిత్రాలలో నటిస్తుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com