Anupama Parameswaran: హీరోలను పొగుడుతూ.. వారి చుట్టూ తిరగను: అనుపమ

Anupama Parameswaran: హీరోయిన్లందిరిదీ ఒక్కొక్కరిది ఒక్కొక్క మనస్తత్వం. ఒకరు ఎక్స్‌పోజింగ్‌లో తప్పేముంది అంటే.. మరికొందరు ఎక్స్‌పోజింగ్ ఉంటే సినిమానే ఒప్పుకోము అంటారు. కొందరు కమర్షియల్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. కొందరు మాత్రం వారి కెరీర్‌లోనే ఆ సినిమాకు రెడ్ ఫ్లాగ్ అంటారు. మరి మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్‌కు కూడా ఇలాంటి కొన్ని కండీషన్స్ ఉన్నాయని ఇటీవల బయటపెట్టింది.
చూడడానికి క్యూట్‌గా ఉంటుంది. మలయాళ అమ్మాయి అయినా తెలుగులో అందంగా డబ్బింగ్ చెప్పుకుంటుంది. అందుకే సెకండ్ హీరోయిన్‌గా టాలీవుడ్‌లో పరిచయమయినా కూడా లీడ్ రోల్ స్థాయికి ఎదగడానికి అనుపమకు ఎక్కువ సమయం పట్టలేదు. ఇటీవల 'కార్తికేయ 2'తో బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది అనుపమ. కానీ ఇలాంటి సమయంలోనే తనకు కోవిడ్ సోకడం ఫ్యాన్స్‌ను కలవరపెడుతోంది. ఇక కొన్నాళ్ల క్రితం తాను ఎలాంటి సినిమాల్లో నటించాలనుకుంటుందో క్లారిటీ ఇచ్చింది ఈ బ్యూటీ.
సినిమాల్లో నటించడానికి తనకంటూ కొన్ని కట్టుబాట్లు ఉన్నాయని అనుపమ చెప్పుకొచ్చింది. హీరోను పొగుడుతూ వారి చుట్టూ తిరిగే పాత్రలు తాను అస్సలు చేయనని గట్టిగా చెప్పేసింది. తాను నటించాలంటే అందులో కథే హీరోగా ఉండాలని తెలిపింది. అలాంటి సినిమాల్లోనే నటించడానికి ఇష్టపడతానంటోంది. ఇక నటిగా తనకు మలయాళం, తెలుగు, తమిళం అనే బేధం లేదని, నటిస్తూనే ఉంటానని స్పష్టం చేసింది అనుపమ పరమేశ్వరన్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com