Anupama Parameswaran: ఆ సినిమా ఫస్ట్ డేకు బుర్కాలో సుదర్శన్ థియేటర్‌కు వెళ్లాను: అనుపమ

Anupama Parameswaran: థియేటర్‌లో సినిమా చూడడం అంటే చాలామందికి ఇష్టం. కానీ సెలబ్రిటీలకు మాత్రం అది కాస్త కష్టం. అందుకే థియేటర్‌లో సినిమా చూసే అనుభవం కోసం ఒక్కొక్కసారి సెలబ్రిటీలు కూడా రిస్క్ తీసుకుంటూ ఉంటారు. అనుపమ పరమేశ్వరన్ కూడా ఓసారి అలాగే చేసిందట. ఇటీవల ఆ సందర్భం గురించి బయటపెట్టింది అనుపమ.
మలయాళ ముద్దుగుమ్మలకు టాలీవుడ్‌లో చాలా డిమాండ్ ఉంటుంది. అందుకే సెకండ్ హీరోయిన్‌గా పరిచయమయినా కూడా వెంటనే హీరోయిన్‌గా మారిపోయింది అనుపమ. అంతే కాకుండా ఎంతోమంది ఫ్యాన్స్‌ను కూడా సొంతం చేసుకుంది. ప్రస్తుతం అనుపమ.. 'బటర్‌ఫ్లై' అనే లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో అనుపమ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టింది.
పవన్ కళ్యాణ్ అంటే తనకు చాలా ఇష్టమన్న విషయాన్ని బయటపెట్టింది అనుపమ. అయితే ఇంకా ఆయన గురించి చెప్పే స్థాయి తనకు రాలేదని తెలిపింది. భీమ్లా నాయక్ సినిమా కోసం ఎవరూ గుర్తుపట్టకుండా బుర్కా వేసుకొని సుదర్శన్ థియేటర్‌కు వెళ్లానన్న సీక్రెట్‌ను రివీల్ చేసింది అనుపమ. ఇక సాయి పల్లవి కూడా అప్పుడప్పుడు ఇలాగే ఎవరూ గుర్తుపట్టకుండా థియేటర్‌లకు వెళ్లి సినిమాకు చూస్తుందని తెలిసిన విషయమే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com