Anushka : అనుష్క 'లేడీ లక్' అవుతుందా..?

నయా హీరో నవీన్ పొలిశెట్టికి సితార తిరిగి అనుష్క చేతిలో పడింది. వీరిద్దరు కలిసి నటిస్తోన్న సినిమా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై మహేష్ బాబు.పి దర్శకత్వంలో వంశీ, ప్రమోద్‌లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 4న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది. తాజాగా ఈ చిత్రం నుంచి లేడీ లక్ అంటూ సాగే వీడియో పాటను రిలీజ్ చేశారు. 'లేడీ లక్' అంటూ సాగే పాటను రామజోగయ్య శాస్త్రి రచించగా.. కార్తిక్ ఆలపించారు.
ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, పాటలకు మంచి స్పందన వచ్చింది. ఇక స్టార్ హీరో ధనుష్ పాడిన పాట చార్ట్ బస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. అన్విత రవళి శెట్టి పాత్రలో అనుష్క.. స్టాండప్ కమెడియన్ సిద్ధు పొలిశెట్టి పాత్రలో నవీన్ పొలిశెట్టి పాత్రలు మనసులను హత్తుకునేలా రూపొందించారు మేకర్లు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఆగస్ట్ 4న ఈ చిత్రం విడుదలకాబోతోంది.
చిన్న హీరోగా కెరీర్ ను మొదలెట్టిన నవీన్ కు అనుష్కతో జతకట్టాల్సిరావడంతో అభిమానులు సినిమాపై ఆత్రుతను వ్యక్తం చేస్తున్నారు. విడుదలవగానే సినిమాను చూసే మూడ్ లో ఉన్నారు. వచ్చే నెలలో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి చిత్ర యునిట్ ఇప్పటికే ప్రమోషన్ పనులను తలకెత్తుకుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com