ఎవరూ ఊహించని కాంబినేషన్.. స్వీటీతో రౌడి స్టార్..

ఎవరూ ఊహించని కాంబినేషన్.. స్వీటీతో రౌడి స్టార్..
ఇది చదివితే మీరు కూడా సర్ ప్రైజ్ అవుతారు.

టాలీవుడ్‌లో క్రేజీ కాంబినేషన్స్ గురించి చదివే ఉంటారు. చాలాసార్లు ఆ క్రేజీ కాంబినేషన్స్ బాక్స్ ఆఫీస్‌ని షేక్ చేశాయి. బట్ కొన్నిసార్లు క్రేజీ కాంబినేషన్స్ సంబంధించిన రూమర్స్ ఉలిక్కిపడేలా చేస్తాయి. ఇది నిజమా అని తట్టి చూసుకునేలా ఉంటాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో అలాంటి కాంబినేషన్ గురించే డిస్కషన్స్ నడుస్తున్నాయి. దాదాపు ఎవరి ఊహల్లోనూ లేని ఈ ప్రాజెక్ట్ నిజంగానే సెట్ అవుతుందా లేదా అనేది అప్పుడే చెప్పలేం కానీ.. ఇది చదివితే మీరు కూడా సర్ ప్రైజ్ అవుతారు.

ఇటీవల స్వీటీ అనుష్క తను నటించిన 'నిశ్శబ్దం' చిత్ర ప్రమోషన్‌లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ.. రెండు కథలు ఫైనల్‌ చేశానని.. త్వరలోనే వాటి గురించి అధికారికంగా ప్రకటిస్తానని తెలిపారు. ఆమె అలా చెప్పటంతో.. తాజాగా టాలీవుడ్‌ సర్కిల్స్‌లో అనుష్కకు సంబంధించిన ఒక వార్త చక్కర్లు కొడుతోంది.

స్వీటీ అనుష్క.. 'రౌడీ స్టార్' విజయ్‌ దేవరకొండతో నటించనుందట. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్నా మూవీని ఓ కొత్త దర్శకుడు తెరకెక్కించనున్నారని టాలీవుడ్ టాక్. ఇప్పటికే స్ర్కిప్ట్, ఇతరత్రా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయని అంటున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో మూవీ వస్తుందని వార్తలు రావటంతో.. అటు అనుష్క అభిమానులు.. ఇటు విజయ్‌ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story