Ariyana Glory: నవంబర్‌లో బిగ్ బాస్ అరియానా పెళ్లి.. కొత్త ఇంట్లో అడుగు..

Ariyana Glory: బిగ్ బాస్ అనే రియాలిటీ షో ఎంతోమందికి లైఫ్ ఇచ్చింది. గ్లామర్ ప్రపంచంలో ఉన్నా కూడా అందరికీ సమానంగా పేరు రావడం కష్టం. అలా ఎక్కువగా వెలుగులోకి రాకుండా ఆగిపోయిన ఎందరినో బిగ్ బాస్ సెలబ్రిటీలుగా నిలబెట్టింది. అందుకే ప్రస్తుతం బిగ్ బాస్‌లో పాల్గొన్నవారందరూ ఎవరి కెరీర్‌లో వారు బిజీ అయిపోయారు. అలాంటి వారిలో ఒకరు అరియానా గ్లోరీ.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 4తో అరియానా ప్రేక్షకులకు పరిచయమయ్యింది. అప్పటివరకు అరియానా కేవలం యూట్యూబ్ ఛానెల్‌లో యాంకర్‌గా ఇంటర్వ్యూలు చేసేది. కానీ బిగ్ బాస్‌లోకి అడుగుపెట్టిన తర్వాత ఎంతోమంది అభిమానులతో పాటు ఆఫర్లు కూడా దక్కించుకోవడం మొదలుపెట్టింది. అందుకే బిగ్ బాస్ ఓటీటీలో ఆఫర్ రాగానే ఎస్ చెప్పేసింది అరియానా.
ప్రస్తుతం తెలుగులో ప్రారంభమయిన బిగ్ బాస్ తెలుగు ఓటీటీ నాన్ స్టాప్ మొదటి సీజన్ చివరి దశకు చేరుకుంది. అరియానా ఇందులో కూడా తన గేమ్‌తో ప్రేక్షకుల దగ్గర నుండి ఓట్లు గెలుచుకుంటూ ముందుకెళ్తోంది. తాజాగా బిగ్ బాస్ హౌజ్‌లోకి వచ్చిన ఓ ఆస్ట్రాలజర్.. అరియానా జాతకాన్ని చూశారు. దాన్ని బట్టి చూస్తే అరియానా నవంబర్‌లో పెళ్లి చేసుకోనుందని అర్థమవుతుందని ఆస్ట్రాలజర్ తెలిపింది. అంతే కాకుండా తన జాతకంలో కొత్త ఇల్లు కూడా రాసుందని చెప్పింది. అయితే ఆస్ట్రాలజర్ చేసిన ఈ వ్యాఖ్యలకు అరియానా అప్పుడు ఏమీ స్పందించలేదు. మరి తను చెప్పిన జాతకం నవంబర్‌లో నిజమవుతుందో లేదో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com