ప‌వ‌ర్‌స్టార్ కోసం ఐదేళ్ళ తర్వాత రీఎంట్రీ..!

ప‌వ‌ర్‌స్టార్ కోసం ఐదేళ్ళ తర్వాత  రీఎంట్రీ..!
హరీష్ శంకర్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్ గా ఆనంద్ సాయిని చిత్ర యూనిట్ ఖరారు చేసింది. ఈ విషయాన్నీ మేకర్స్ అధికారికంగా సోషల్ మీడియాలో ప్రకటించారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించనున్న 28వ చిత్రానికి సంబంధించిన కీలకమైన అప్డేట్ వచ్చింది. హరీష్ శంకర్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్ గా ఆనంద్ సాయిని చిత్ర యూనిట్ ఖరారు చేసింది. ఈ విషయాన్నీ మేకర్స్ అధికారికంగా సోషల్ మీడియాలో ప్రకటించారు. కాగా ఆనంద్ సాయి, పవన్ కళ్యాణ్ మంచి స్నేహితులన్న సంగతి తెలిసిందే.. ఖుషి,జల్సా, తమ్ముడు, తొలిప్రేమ చిత్రాలకి గాను ఆనంద్ సాయి ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేశారు.

మిగతా హీరోలతో కూడా అయన పనిచేశారు. అయితే గ‌త ఐదేళ్లుగా ఆయ‌న తెలంగాణలోని యాదాద్రి దేవాల‌యం పున‌ర్నిర్మాణం కోసం ప‌ని చేస్తున్నారు. ఇప్పుడు ఆ ఆలయ పనులు చివరిదశకు చేరుకోవడంతో అయన మళ్ళీ టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. కాగా పవన్ 28వ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.


Tags

Read MoreRead Less
Next Story