అరుంధతి మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడెలా ఉందో తెలుసా?

అనుష్క ప్రధాన పాత్రలో కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అరుంధతి... అనుష్కకి ఈ సినిమా మంచి క్రేజ్ ని తెచ్చిపెట్టింది.
ఈ సినిమా తరవాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు అనుష్క ఫస్ట్ ఛాయస్ గా మారిపోయింది. ఈ సినిమాతోనే సోనూసూద్ స్టార్ విలన్ గా పేరు సంపాదించుకున్నాడు.
అయితే ఈ సినిమాలో చిన్నప్పటి అనుష్కగా నటించిన అమ్మాయి గుర్తుండే ఉంటుంది కదా.. ఆ అమ్మాయి పేరు దివ్య నగేష్ ..
గంభీరమైన నటనతో చిన్నారి అనుష్క పాత్రకి ప్రాణం పోసింది.. ఈసినిమాకి గాను దివ్య నాగేష్ కి నంది అవార్డు కూడా లభించింది.
అయితే ఈ సినిమా తర్వాత మలయాళంలో పలు సినిమాల్లో హీరోయిన్‌గా చేసింది. ఇక హీరోయిన్ గా తెలుగులో నేను నాన్న అబద్దం అనే చిత్రంలో నటించింది.
హీరోయిన్ గా నిలదొక్కుకునేందుకు ఇంకా ప్రయత్నాలు చేస్తోంది దివ్య నాగేష్.. ప్రస్తుతం తమిళ, మలయాళ సినిమాల్లో నటిస్తూ బిజీగానే ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com