Ashu Reddy: పవన్ కళ్యాణ్ పేరును అక్కడ టాటూ వేయించుకున్న అషు.. పోస్ట్ వైరల్..

Ashu Reddy: కొంతమంది టాటూలు అంటే ఇష్టపడకపోయినా.. చాలామంది టాటూలను విపరీతంగా ఇష్టపడతారు. పైగా ఈమధ్యకాలంలో టాటూ అనేది ఫ్యాషన్ సింబల్‌గా మారిపోయింది. నచ్చిన వ్యక్తి పేరు టాటూ వేయించుకోవడం చాలామందికి అలవాటుగా మారిపోయింది. తాజాగా అషు రెడ్డి కూడా తన ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ పేరును టాటూ వేయించుకుంది. కానీ టాటూ వేయించుకున్న చోటు గురించే ప్రస్తుతం నెటిజన్లలో చర్చ మొదలయ్యింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎంతోమంది పవన్ కళ్యాణ్ పేరు, ఫోటోను టాటూ వేయించుకున్న వారు కూడా ఉన్నారు. అలాగే కొందరు హీరోయిన్లకు కూడా పవన్ కళ్యాణ్‌పై క్రష్ ఉంది. అందులో చాలామంది ఈ విషయాన్ని ఓపెన్‌గానే చెప్పారు. అందులో ఒకరు బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డి.
పవన్ కళ్యాణ్‌పై తనకున్న ప్రేమను చెప్తూ.. అషు రెడ్డి ఇప్పటికే పలుమార్లు పలు సంచలన వ్యాఖ్యలు కూడా చేసింది. అంతే కాకుండా తన పేరును టాటూ కూడా వేయించుకున్నానని ఇప్పటికే వెల్లడించింది. తాజాగా ఈ టాటూను చూపిస్తూ అషు ఒక ఫోటోను షేర్ చేసింది. 'మీ పేరును టాటూ వేయించుకునేంత వరకు నాకు టాటూలంటే పెద్దగా ఇష్టం లేదు. నా దేవుడు' అని ఆ పోస్ట్‌కు క్యాప్షన్ కూడా పెట్టింది. ఆ టాటూ ఎద పైభాగంలో ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com