Avika Gor: బాయ్‌ఫ్రెండ్ గురించి గొప్పగా మాట్లాడిన నటి.. తన వల్లే అంతా అంటూ..

Avika Gor: బాయ్‌ఫ్రెండ్ గురించి గొప్పగా మాట్లాడిన నటి.. తన వల్లే అంతా అంటూ..
Avika Gor: కొందరు నటీనటులు తమ పర్సనల్ లైఫ్ గురించి, రిలేషన్‌షిప్ స్టేటస్ గురించి బయటికి చెప్పడానికి ఎక్కువగా ఇష్టపడరు.

Avika Gor: కొందరు నటీనటులు తమ పర్సనల్ లైఫ్ గురించి, రిలేషన్‌షిప్ స్టేటస్ గురించి బయటికి చెప్పడానికి ఎక్కువగా ఇష్టపడరు. కొందరు మాత్రం దాచాల్సిన అవసరం లేదనుకుంటారో ఏమో కానీ.. రిలేషన్‌షిప్ గురించి ఓపెన్‌గా చెప్పేస్తుంటారు. తాజాగా ఓ హీరోయిన్ కూడా తన రిలేషన్‌షిప్ గురించి ఓపెన్‌గా చెప్పడం మాత్రమే కాదు.. బాయ్‌ఫ్రెండ్ గురించి కూడా చాలా గొప్పగా మాట్లాడింది.

అవికా గోర్.. ఈ పేరు చెప్తే.. ఎక్కువమంది గుర్తుపడతారో లేదో తెలియదు కానీ.. చిన్నారి పెళ్లికూతురు ఆనంది అనగానే చాలామంది టక్కున గుర్తుపట్టేస్తారు. ముందు బుల్లితెరపై తన ప్రతిభతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం వెండితెరపై తన హవా కొనసాగిస్తోంది. ఇక చాలాకాలం గ్యాప్ తర్వాత అవికా.. తెలుగులో నటిస్తున్న చిత్రం 'టెన్త్ క్లాస్ డైరీస్'. ఈ మూవీ ప్రమోషన్స్ సమయంలో తన బాయ్‌ఫ్రెండ్ గురించి పలు ఆసక్తికర విషయాలు షేర్ చేసుకుంది అవికా.


ముందుగా తన టెన్త్ క్లాస్ రోజుల గురించి మాట్లాడుతూ.. తన టెన్త్ క్లాస్ రోజులన్నీ షూటింగ్స్‌లోనే గడిచిపోయాయని చెప్పుకొచ్చింది అవికా. అప్పటికే తాను నటి కావడంతో స్కూల్‌కు చాలా తక్కువగా వెళ్లేదట. కానీ వెళ్లిన కొన్నిరోజులు మాత్రం తనకు బాగా గుర్తుండిపోయాయని తెలిపింది. అంతే కాకుండా టెన్త్ క్లాస్ డైరీస్ చిత్రం అందరినీ మళ్లీ ఆరోజుల్లోకి తీసుకెళ్తుంది అని అంటోంది అవికా.


ఆ తర్వాత అవికా.. బాయ్‌ఫ్రెండ్ మిలింద్ గురించి కూడా మాట్లాడింది. ప్రస్తుతం తన వ్యక్తిగత జీవితం చాలా బాగుందని తెలిపింది. తాను బరువు తగ్గడం నుంచి నిర్మాతగా మారడం వరకూ తన ప్రతి అడుగులో మిలింద్ తోడుగా ఉన్నాడని బాయ్‌ఫ్రెండ్‌ను అందళం ఎక్కించింది అవికా. తానేం చేయగలనో తెలుసుకునేలా చేసి తనకు మరింత సపోర్ట్‌గా నిలిచాడని చెప్పింది. తన పరిచయం తర్వాత అవికాలో మరింత ఆత్మవిశ్వాసం పెరిగిందని తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story