బాలయ్యను మెప్పించిన 'ఉప్పెన'

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా నటించిన తాజా చిత్రం 'ఉప్పెన'.. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మొదటి ఆట నుంచే మంచి టాక్ సంపాదించుకొని భారీ వసూళ్ల వైపు దూసుకెళ్తోంది. ఈ మూవీలో హీరో హీరోయిన్ల నటనకి గాను పలువురు ప్రముఖుల నుంచి మంచి మార్కులు వస్తున్నాయి. అయితే తాజాగా ఈ సినిమాను హీరో బాలకృష్ణ కుటుంబ సమేతంగా వీక్షించారు. ఆయన కోసం నిర్మాతలు స్పెషల్ షోని ఏర్పాటు చేసారు. అనంతరం మూవీ అద్భుతంగా ఉందని చిత్రబృందాన్ని బాలయ్య అభినందించారు. ఈ విషయాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
Nata Simham #NandamuriBalakrishna garu enjoyed the screening of #Uppena along with his family & appreciated our entire cast and crew ❤️#BlockbusterUppena 🌊#PanjaVaisshnavTej @IamKrithiShetty @VijaySethuOffl @BuchiBabuSana @ThisIsDSP @aryasukku @SukumarWritings @adityamusic pic.twitter.com/Ym40WkPgnW
— Mythri Movie Makers (@MythriOfficial) February 20, 2021
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com