NBK 107 Movie : బాలయ్య కొత్త మూవీ షురూ..!

NBK 107 Movie : నందమూరి నటసింహం బాలకృష్ణ మంచి దూకుడు మీద ఉన్నారు.. ఇప్పటికే బోయపాటి డైరెక్షన్ లో అఖండ సినిమాని కంప్లీట్ చేసిన ఆయన.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయబోయే సినిమాని పట్టాలేక్కించారు. తాజాగా ఆ సినిమా పూజా కార్యక్రమం శనివారం ఉదయం హైదరాబాద్‌లో వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమానికి చిత్రయూనిట్ తో పాటుగా ఇండస్ట్రీలోని దర్శకులు కొరటాల శివ, బోయపాటి శ్రీను, హరీశ్ శంకర్, వి.వి.వినాయక్, బుచ్చిబాబు, బాబీతోపాటు పలువురు పాల్గొన్నారు. బాలయ్య 107వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఇందులో బాలయ్య ఫుల్ యంగ్ లుక్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణకు జోడీగా నటి శ్రుతిహాసన్ నటిస్తోంది. సినిమా పైన అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాకి తమన్ సంగీతం అందించనున్నాడు.
#NBK107 kicks off on an auspicious note with Pooja Event💥
— Mythri Movie Makers (@MythriOfficial) November 13, 2021
Clap by #VVVinayak garu ❤️
Camera Switch on by #BoyapatiSreenu garu ❤️
First shot direction by @harish2you garu ❤️#KoratalaSiva garu, @dirbobby garu, @BuchiBabuSana garu handed over the script to @megopichand garu❤️ pic.twitter.com/KW0KkpTWGk
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com