జై బాలయ్య... రికార్డులతో దూసుకుపోతున్న 'అఖండ' టీజర్..!

మాములుగానే నందమూరి నటసింహం బాలకృష్ణ నుంచి సినిమా వస్తుందంటేనే అంచనాలు ఓ స్థాయిలో ఉంటాయి. ఇక అందులోనూ బోయపాటి శ్రీను నుంచి సినిమా అంటే ఆ అంచనాలు రెట్టింపు అవుతాయి. ఎందుకంటే ఇప్పటికే వీరి కాంబినేషన్ నుంచి వచ్చిన సింహ, లెజెండ్ చిత్రాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి వీరి నుంచి అఖండ అనే సినిమా తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ విడుదలైంది.
ఇప్పటివరకు ఎప్పుడు చూడని సరికొత్త లుక్‌లో బాలయ్య కనిపించడం, తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆదరిపోవడంతో టీజర్ సోషల్ మీడియాలో దుమ్ముదులుపుతుంది. ఈ టీజర్ 33మిలియన్లకి పైగా వ్యూస్ సాధించి బాలకృష్ణ కెరీర్‌లో ఇప్పటి వరకు ఉన్న రికార్డులన్నీంటిని బద్దలుకొట్టింది. 386k పైగా లైక్స్‌తో 'అఖండ' దూసుకెళ్తున్నాడు. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో పూర్ణ కీలక పాత్రలో నటిస్తుంది.
శ్రీకాంత్ విలన్ గా నటిస్తున్నాడు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం మే 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com