అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వనున్న బాలయ్యబాబు!

నందమూరి నటసింహాం బాలకృష్ణ మాస్ క్యారెక్టర్స్‌లో, పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నారు. కమర్షియల్ హీరోగా.. తెలుగునాట ఫ్యాక్షన్ సినిమాలకు క్రేజ్‌ను పెంచి బాక్సాఫీస్ బొనాంజాగా.. ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు బాలయ్య బాబు. వైవిధ్య మైన పాత్రలు చేయడమే కాకుండా జానపద, పౌరాణిక, చారిత్రాత్మక, భక్తిరస చిత్రాల్లో నటించి.. నవరస నటనాయకుడిగా డిఫెరెంట్ వేరియేషన్స్ చూపించారు.
బాలకృష్ణ.. తండ్రికి తగ్గ తనయుడిగా నటనతో పాటు దర్శకత్వ బాధ్యతలు కూడా తీసుకున్నారు. బాలయ్య బాబు స్వీయ దర్శకత్వంలో 'నర్తనశాల' మూవీని స్టార్ట్ చేశారు. బాలకృష్ణ, సౌందర్య, శరత్‌బాబు, శ్రీహరి తదితరులు కీలక పాత్రల్లో ఈ సినిమా ప్రారంభమైంది. కొంత షూటింగ్ జరిగిన తర్వాత సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. దీంతో ఈ మూవీ షూటింగ్ ఆగిపోయింది. ఎప్పటికైనా ఈ మూవీని పూర్తి చేస్తానని బాలకృష్ణ సందర్భం వచ్చినప్పుడల్లా చెప్పేవారు. తాజాగా నర్తనశాల మూవీకి సంబంధించి ఓ ప్రకటన చేశారు. నర్తనశాల సినిమాకు సంబంధించిన 17 నిమిషాల వీడియోను ఫాన్స్ కోసం విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటలకు విడుదల చేయనున్నారు.
నాకు అత్యంత ఇష్టమైన చిత్రం నాన్నగారి నర్తనశాల. ఆ చిత్రాన్ని నా దర్శకత్వంలో ప్రారంభించిన విషయం తెలిసిందే.ఎంతో కాలంగా మీరు...
Posted by Nandamuri Balakrishna on Monday, October 19, 2020
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com