Balakrishna Unstoppable : 'దెబ్బకు థింకింగ్ మారిపోవాల'.. బాలయ్య టాక్ షో అదుర్స్..!

Balakrishna Unstoppable : పంచ్ డైలాగులు సినిమాల్లోనేనా.. బాలకృష్ణ టాక్ షో చేస్తే అది కూడా ఓ రేంజ్‌లో ఉండాలి.. బాలయ్య అభిమానుల్ని ఉత్సాహపరచాలంటే ఆ మాత్రం ఉండాల్సిందే. మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున బాటలో నందమూరి బాలకృష్ణ కూడా బుల్లితెర ప్రేక్షకులకు కనువిందు చేయనున్నారు.
ఓ టాక్ షోని హోస్ట్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ప్రముఖ తెలుగు ఓటీటీ 'ఆహా'లో రానున్న ఈ షో ప్రోమో తాజాగా విడుదలైంది. బాలయ్య ఇమేజ్‌ని మరింత పెంచేదిగా ఉన్న ఈ ప్రోమో సినిమా టీజర్‌ని తలపిస్తుంది. స్టైలిష్ లుక్‌లో కనిపించిన బాలకృష్ణ వయసు మీద పడిన ఛాయలు అస్సలు కనిపించకపోగా.. ఆయన చెబుతున్న పవర్ ఫుల్ డైలాగ్స్‌కి వన్స్‌మోర్ అనాల్సిందే..
' నీకు చిత్త శుద్ధి ఉన్నప్పుడు.. నీకు లక్ష్య శుద్ధి ఉన్నప్పుడు.. నీకు సంకల్ప శుద్ధి ఉన్నప్పుడు.. నిన్ను పంచభూతాలు కూడా ఆపలేవు. మాటల్లో ఫిల్టర్ ఉండదు.. సరదాలో స్టాప్ ఉండదు.. సై అంటే సై.. నై అంటే నై.. ఒన్స్ ఐ స్టెప్ ఇన్.. దెబ్బకు థింకింగ్ మారిపోవాల' బాలయ్య బాబు చెప్పిన డైలాగ్‌లు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ ప్రోమోతో షో మీద అంచనాలు భారీగా ఉన్నాయి. నవంబర్ 4 నుంచి ఆహాలో ప్రసారం కానున్న ఈ షో కోసం అభిమానులు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. బాలయ్య సినిమాలు బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తే.. ఇప్పుడు ఆయన చేస్తున్న షో కూడా మంచి పాపులారిటీ సంపాదించుకుంటుందనడంలో అతిశయోక్తి లేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com