టాలీవుడ్

Balakrishna: బాలయ్య సినిమాలో హీరోయిన్ ఛేంజ్.. ఈసారి తెరపైకి కొత్త పేరు..

Balakrishna: ముందుగా అనిల్ రావిపూడి, బాలకృష్ణ సినిమాలో హీరోయిన్‌గా బిందు మాధవి ఉంటుందని అనుకున్నారంతా.

Balakrishna: బాలయ్య సినిమాలో హీరోయిన్ ఛేంజ్.. ఈసారి తెరపైకి కొత్త పేరు..
X

Balakrishna: 'అఖండ' హిట్‌తో బాలయ్య మరోసారి ఫుల్ ఫామ్‌లోకి వచ్చాడు. అందుకే తన తరువాతి సినిమాతో ఇదే సక్సెస్‌ను కొనసాగించాలని బాలకృష్ణ ఫిక్స్ అయ్యారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో ఓ మూవీ చేస్తున్నారు బాలయ్య. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇంతలోనే మరో మూవీకి బాలయ్య సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా బాలకృష్ణ అప్‌కమింగ్ మూవీ నుండి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటికొచ్చింది.

గోపీచంద్ మలినేని తర్వాత బాబీతో బాలకృష్ణ సినిమా ఉంటుంది అనుకున్నారంతా. కానీ దానిపై ఇప్పటికీ క్లారిటీ లేదు. మరోవైపు 'ఎఫ్ 3' డైరెక్టర్ అనిల్ రావిపూడి.. బాలయ్యతో తన సినిమా ఉంటుందని ప్రకటించేశాడు. అంతే కాకుండా ఈ సినిమా క్యాస్టింగ్ కోసం వెతకడం కూడా మొదలుపెట్టాడు. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనేదానిపై ఓ ఇంట్రెస్టింగ్ రూమర్ టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది.

ముందుగా అనిల్ రావిపూడి, బాలకృష్ణ సినిమాలో హీరోయిన్‌గా బిందు మాధవి ఉంటుందని అనుకున్నారంతా. కానీ ఆ ప్లేస్‌లోకి ఇప్పుడు ప్రియమణి వచ్చింది. ఇటీవల వెంకటేశ్‌తో నటించిన 'నారప్ప'తో సెకండ్ ఇన్నింగ్స్‌లో మొదటి హిట్ కొట్టిన ప్రియమణి.. ఇప్పుడు ఏకంగా నందమూరి హీరో సినిమాలోనే ఛాన్స్ కొట్టేసింది. ఇక ఇందులో యంగ్ బ్యూటీ శ్రీలీల.. బాలకృష్ణ కూతురి పాత్రలో కనిపించనుంది.Divya Reddy

Divya Reddy

Divya reddy is an excellent author and writer


Next Story

RELATED STORIES