5 April 2021 11:13 AM GMT

Home
 / 
సినిమా / టాలీవుడ్ / మనది పాల వ్యాపారం.....

మనది పాల వ్యాపారం.. పవన్‌ది బ్లడ్ వ్యాపారం: బండ్ల గణేష్

పవన్ గురించి ఏకధాటిగా మాట్లాడుతూ పవన్ అభిమానుల హృదయాలను దోచుకున్నారు.

మనది పాల వ్యాపారం.. పవన్‌ది బ్లడ్ వ్యాపారం: బండ్ల గణేష్
X

ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్‌కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే వల్లమాలిన అభిమానం. ఆయనను ఓ నటుడిగా, ఓ రాజకీయ నాయకుడిగా కంటే వ్యక్తిగా తానెంతో ఇష్టపడతానంటారు. పవన్‌లో ఓ దేవుడిని చూస్తాడు. అంతగా ఆరాధిస్తాడు. కోట్ల బడ్జెట్ పెట్టుబడి పెట్టి ఆయనతో సినిమాలు తీయడానికి వెనుకాడని బండ్ల గణేష్.. పవన్ నటించిన వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్నారు.

పవన్ గురించి ఏకధాటిగా మాట్లాడుతూ పవన్ అభిమానుల హృదయాలను దోచుకున్నారు. ఆదివారం జరిగిన ఈ వేడుకలో ముఖ్య అతిధిగా పాల్గొన్న బండ్ల గణేష్ మాట్లాడుతూ.. ఈశ్వరా, పవనేశ్వరా, పవరేశ్వరా.. పవన్ కళ్యాణ్‌గారు ఒక వ్యసనం. అలవాటు చేసుకుంటే వదలలేం. కొందరిని ఇష్టపడడమే కాని వదులుకోవడం ఉండదు. ఏరా మీబాస్ కాసేపు సినిమాలు అంటారు, మరికాసేపు రాజకీయాలు అంటాడు అని నా ఫ్రెండ్ నాతో అంటే అతడికి నేను చెప్పాను..

ఒరేయ్ ఆయనకు మనలా పాల వ్యాపారం, మందు వ్యాపారం, కోళ్ల వ్యాపారం ఇలాంటివేమీ తెలియాదు. ఆయనకు తెలిసిందల్లా బ్లడ్ వ్యాపారం.. రక్తాన్ని చెమటగా మార్చి, ఆ చెమటతో నటించి మనకు సంతోషాన్ని కలిగిస్తుంటారు అని అన్నాను. కష్టాల్లో ఉన్న వారికి తాను చెమటోడ్చి సంపాదించిన కోటి రూపాయలతో ఇన్సూరెన్స్ చేయించిన గొప్ప వ్యక్తి ఆయన అని నా ఫ్రెండ్‌ని తిట్టాను అని చెప్పారు. పవన్ గారి నిజాయితీ ఏంటో నాకు తెలుసు కాబట్టి ఇదంతా చెబుతున్నా అని అన్నారు.అంజనీ పుత్ర పవన సుతనామ అని ఊరికే అనలేదు. చాలా మంది పుడతారు గిడతారు. కొందరే చరిత్రలో మిగిలిపోతారు. రోజుకు 18 గంటలు కష్టపడుతూ సినిమా వెనక సినిమా చేస్తూ ప్రత్యక్షంగా 1200 కుటంబాలకు ఉపాధి కల్పిస్తున్నారు. పవన్ గారికి ఏదో ఒకటి చెప్పి బుట్టలో వేద్దాం అని వెళ్తా. కానీ ఆయన దగ్గరకు వెళ్లి ఆయన కళ్లు చూడగానే అన్నీ మర్చిపోతాను. ఆ కళ్లలో అంత నిజాయితీ ఉంటుంది. నేను నిజంగా పవన్ కళ్యాణ్ భక్తుడినే. ఏడు కొండల వాడికి అన్నమయ్య, శివయ్యకు భక్తకన్నప్ప, శ్రీరాముడికి హనుమంతుడు, పవర్ స్టార్‌కు బండ్ల గణేష్ అని సగర్వంగా చెప్పుకుంటా.

పవన్ గారికి పొగరు అన్న ఓ వ్యక్తికి.. పాక్ గడ్డమీద అక్కడి సైనికులకు దొరికి చిత్ర హింసలు పెట్టినా మన దేశ రహస్యాలు చెప్పని వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ మీస కట్టుకున్నంత పొగరు పవన్ కళ్యాణ్‌కి ఉందని చెప్పా. చైనాతో యుద్ధంలో ఫిరంగి ట్రిగ్గర్ నొక్కబోయే భారత సైనికుడికి ఉన్నంత పొగరు ఉందని చెప్పా. ఛత్రపతి శివాజీ కత్తికి ఉన్న పదునంత పొగరు అని చెప్పా. బ్రిటీష్ సామ్రాజ్య జెండా దించేసి, ఎర్రకోట మీద ఎగిరిన మువ్వన్నెల జెండాకున్నంత పొగరుందని చెప్పా.

మనది పాల వ్యాపారం.. పవన్‌ది బ్లడ్ వ్యాపారం: బండ్ల గణేష్భారత రాజ్యంలో అంబేద్కర్ చేతి రాతకున్నంత పొగరుందని చెప్పా, పరశురాముడి గొడ్డలికున్నంత పదును, శ్రీరాముడు విడిచిన బాణంలో పదునంత పొగరుందని చెప్పా.. శ్రీకృష్ణుడి సుదర్శనచక్రంలోని పదునంత పొగరుందని చెప్పా. అన్నిటికంటే జై పవర్ స్టార్ అని అరిచే అభిమాని గుండెకున్నంత పొగరుందని చెప్పా అంటూ ఇచ్చిన బండ్ల గణేష్ స్పీచ్‌కి పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయ్యారు. ఈలలు, గోలలతో పవన్‌పై ఉన్న తమ అభిమానాన్ని చాటుకున్నారు.

Next Story