మళ్ళీ దొరికిన బండ్ల.. ఓ రేంజ్‌లో ఆడుకున్న నెటిజన్లు.. !

మళ్ళీ దొరికిన బండ్ల.. ఓ రేంజ్‌లో ఆడుకున్న నెటిజన్లు.. !
సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ చేసిన ఓ ట్వీట్ నవ్వులపాలైంది. రెండుసార్లు గణేష్.. తప్పులో కాలేయడంతో అతడిని ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు నెటిజన్లు.

సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ చేసిన ఓ ట్వీట్ నవ్వులపాలైంది. రెండుసార్లు గణేష్.. తప్పులో కాలేయడంతో అతడిని ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు నెటిజన్లు. ఇంతకీ ఏమైందంటే.. తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు మళ్ళీ పెరుగుతుండడంతో మాస్క్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం అంక్షలు విధించింది. మాస్క్ ధరించని వారి పైన ఫైన్‌లు వేస్తూ కఠినంగా వ్యవహరిస్తోంది. అలానే బండ్ల గణేష్‌ మాస్క్ ధరించనందు వల్ల రెండు వేల రూపాయలు ఫైన్ పడింది. రూ.2 వేల రూపాయల ఫైన్‌ వేసిన ఫొటోను బండ్ల ట్విటర్‌లో షేర్‌ చేశాడు.

ఈ సందర్భంగా అందరూ మాస్క్‌ ధరించాలని సూచించాడు. మంచి ఉద్దేశంతోనే బండ్ల గణేష్ ట్వీట్ చేశాడు కానీ అందులో రాసిన పదాలు మాత్రం తప్పు.. Wear Mask అని రాయాల్సింది పోయి Where Mask అని ట్వీట్‌ చేశాడు. దీన్ని చాలామంది వేలెత్తి చూపించడంతో వెంటనే దాన్ని డిలీట్‌ చేశాడు. అయితే అప్పటికే అందరూ స్క్రీన్ షాట్స్ తీసేశారు. ఇక మరోసారి Ware Mask అంటూ మరోసారి తప్పు ట్వీట్‌ చేసి మళ్లీ అడ్డంగా దొరికిపోయాడు.

మనది ఏ స్కూల్‌ అన్నా.. అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. అది ware, where, ware కాదు, 'wear' అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం బండ్లకి సపోర్ట్ గా నిలుస్తున్నారు. మాస్క్ కచ్చితంగా ధరించండి.. లేకపోతే ఇలా జరుగుతుందని తెలియని చాలా మందికి చెప్పాలని అనుకున్నాడు. ఆయన ఉద్దేశం ఏంటో కూడా మీకు తెలుసు.. అందులో మంచి తీసుకోండి చెడు ఎందుకు అని కామెంట్స్ చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story