Vijay Devarakonda: విజయ్ దేవరకొండకు బండ్ల గణేష్ ఇన్‌డైరెక్ట్ కౌంటర్..

Vijay Devarakonda: ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలో అడుగుపెట్టి ఎంతోమంది స్టార్ హీరోలకు పోటీ ఇస్తున్నాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. ఇప్పుడు ఏకంగా పూరీ జగన్నాధ్‌లాంటి డైరెక్టర్‌తో పాన్ ఇండియా సినిమాలు చేసేస్తున్నాడు. అయితే వీరి కాంబినేషన్‌లో తెరకెక్కిన మొదటి చిత్రం 'లైగర్' ట్రైలర్ లాంచ్ ఓ పండగలాగా జరిగింది. ఈ ఈవెంట్‌లో విజయ్ మాటలు సంచలనాన్ని సృష్టించాయి.
విజయ్ నెపోటిజం కిడ్ కాదు.. దానిని ఉద్దేశిస్తూ లైగర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో కొన్ని వ్యాఖ్యలు చేశాడు. 'మా నాన్న ఎవరో మీకు తెలీదు. మా తాత ఎవరో మీకు తెలీదు. రెండేళ్లలో నా సినిమా ఏమీ రాలేదు. అంతకు ముందు వచ్చిన సినిమా కూడా పెద్దగా గుర్తుపెట్టుకునేది కాదు. అయినా మీ అభిమానం అలాగే ఉంది' అంటూ ఫ్యాన్స్‌ను ప్రశంసించాడు విజయ్. ఇవి నేరుగా నెపోటిజం ద్వారా వచ్చిన నటులను ఉద్దేశించి మాట్లాడినట్టే ఉంది అని ప్రేక్షకులు అనుకున్నారు.
స్టార్ నిర్మాత బండ్ల గణేష్.. ఇప్పటికే పూరీ జగన్నాధ్‌పై ఓపెన్ కామెంట్స్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఇప్పుడు ఆయన హీరో అయిన విజయ్‌పై ఇన్‌డైరెక్ట్ కౌంటర్ వేశారు. 'తాతలు తండ్రులు ఉంటే సరిపోదు టాలెంట్ కూడా ఉండాలి. ఎన్టీఆర్‌లా, మహేష్ బాబులా, రామ్ చరణ్‌లా, ప్రభాస్‌లా గుర్తుపెట్టుకో బ్రదర్' అని ట్వీట్ చేశారు బండ్ల గణేష్. ఈ ట్వీట్‌లో ఎవరి పేరును ప్రస్తావించకపోయినా.. ఇది విజయ్‌కే కౌంటర్ అని చూసేవారికి అర్థమయిపోతోంది.
తాతలు తండ్రులు ఉంటే సరిపోదు టాలెంట్ కూడా ఉండాలి ఎన్టీఆర్ ల మహేష్ బాబు లా రామ్ చరణ్ లా ప్రభాస్ లా గుర్తుపెట్టుకో బ్రదర్ 🔥🔥🔥🔥 @AlwaysRamCharan @tarak9999 @urstrulyMahesh 🐅🐅🐅🐅
— BANDLA GANESH. (@ganeshbandla) July 22, 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com