Bandla Ganesh : సూపర్ గణేషన్నా.. గుడ్ జాబ్..!

కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడు మాములుగా లేదు.. రోజురోజుకూ కరోనా కేసులు వీపరితంగా పెరుగుతున్నాయి. దీనితో జనాలు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. కొందరైతే ఎక్కడ కరోనా మహమ్మారి సోకుతుందో అనే భయంతో సెలూన్ షాప్ కి కూడా వెళ్ళడం లేదు.
అలాగే చాలా మంది గడ్డాలు, మీసాలు పెంచేస్తున్నారు. కొందరు మాత్రం ఇంట్లోనే కత్తెర పట్టి కటింగ్ చేసుకుంటున్నారు. అందులో భాగంగానే బండ్ల గణేష్ కూడా అదే పనిచేశాడు. తన తండ్రికి తానే స్వయంగా కటింగ్ చేశాడు. ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
"కరోనా భయంతో మా నాన్నకి ఈరోజు మా షాద్ నగర్ ఇంట్లో నేనే కటింగ్ చేశాను" అని క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతంది. దీనిపైన నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. సూపర్ గణేషన్నా.. గుడ్ జాబ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
కరోనా భయంతో మా నాన్నకి ఈరోజు మా షాద్ నగర్ ఇంట్లో నేనే కటింగ్ చేశాను 😎 pic.twitter.com/kJEi0GGyXa
— BANDLA GANESH. (@ganeshbandla) May 8, 2021
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com