'మనిషి అంటే ఇలా ఉండాలి'.. చిరు పైన బండ్ల ట్వీట్..

మనిషి అంటే ఇలా ఉండాలి.. చిరు పైన బండ్ల ట్వీట్..
సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి పైన ఆయన చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చిరు ఫొటోను షేర్‌ చేస్తూ.. 'మా దేవరకి అన్న.. అందరికి నేను అనే నమ్మకం. మనిషి అంటే ఇలా ఉండాలి.. అని ప్రజలకు చెప్పిన మహోన్నత వ్యక్తి మా పెద్దన్న మెగాస్టార్‌' అంటూ చేతులు జోడించిన ఎమోజీని జత చేశాడు. బండ్ల గణేష్ మెగా ఫ్యామిలీకి వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే. అందులోనూ పవన్ కళ్యాణ్ అంటే అభిమానం కాదు భక్తి అని చెప్పాలి. ఇటీవల పవన్‌కు దేవర అనే పేరును కూడా పెట్టుకున్నాడు బండ్ల గణేష్. కానీ ఈ సారి పవన్ పైన కాకుండా చిరు పైన తన అభిమానాన్ని చాటుకున్నాడు గణేష్ . అయితే తాజాగా చిరు పైన ఈ ట్వీట్‌ను బండ్ల ఏ సందర్భంగా చేశాడన్నది మాత్రం స్పష్టం చేయలేదు.


Tags

Read MoreRead Less
Next Story