బాలయ్య అభిమానులకి గుడ్ న్యూస్!

బాలయ్య అభిమానులకి గుడ్ న్యూస్!
టాలీవుడ్ అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

టాలీవుడ్ అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సింహ, లెజెండ్ చిత్రాల తరవాత వీరి కాంబినేషన్ నుంచి సినిమా కావడంతో సినిమా పైన మంచి అంచనాలు ఉన్నాయి. అయితే . గతేడాది బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఫస్ట్ రోర్‌ తప్ప ఇప్పటివరకు సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ అయితే లేదు. దీనితో అభిమానుల్లో కొంత నిరాశ నెలకొంది. ఈ క్రమంలోనే సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్ ను అనౌన్సు చేసి అభిమానులను సప్రైజ్ చేసింది. ఈ ఏడాది మే 28న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించింది. కాగా మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నాడు.

Tags

Read MoreRead Less
Next Story