ఆయన చనిపోయాక పెళ్లి పై ఆలోచనే పోయింది : సితార

ఆయన చనిపోయాక పెళ్లి పై ఆలోచనే పోయింది : సితార
అందం, అభినయం రెండు కలిపితే నటి సితార అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. సహజనటీమణులు అనగానే మనకి గుర్తుకు వచ్చే అతికొద్దిమందిలో సితార ఒకరు.

అందం, అభినయం రెండు కలిపితే నటి సితార అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. సహజనటీమణులు అనగానే మనకి గుర్తుకు వచ్చే అతికొద్దిమందిలో సితార ఒకరు. కె. బాలచందర్ ద్వారా తమిళ్ ఇండస్ట్రీలోకి నటిగా అడుగుపెట్టిన సితార.. ఆ తర్వాత తెలుగు, మలయాళ, కన్నడ చిత్రాల్లో కూడా నటించింది. హీరోయిన్‌గా గుర్తింపు సాధించుకున్న ఆమె.. ఆ తర్వాత కాస్త బ్రేక్ తీసుకుని.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఆమె ఫుల్ బిజీగా ఉన్నారు.

ప్రస్తుతం 48 ఏళ్ల వయసున్న సితార ఇంకా సింగిల్ గానే ఉన్నారు. దీనికి గల కారణం గురించి ఆమె ఇంటర్వ్యూలో వెల్లడించారు. సితార కేరళలోని కిలిమానూర్ ప్రాంతంలో 1973, జూన్ 30న జన్మించారు. ఆమె పూర్తి పేరు సితార నాయర్. పరమేశ్వరన్ నాయర్, వల్సల నాయర్ దంపతులకు జన్మించింది. కాలేజీ చదువుతున్న రోజుల్లోనే ఆమె సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే ఇలా పెళ్లి చేసుకోకుండా ఉండిపోవడానికి తన తండ్రే కారణమని చెప్పుకొచ్చింది.

"మా నాన్నగారు నాకు అన్ని విషయాల్లో మద్దతుగా నిలిచేవారు. ప్రతి చిన్న విషయానికి కూడా నేను ఆయన పైనే ఆధారపడేదాన్ని.. సినిమాలకి సంబంధించిన విషయాలు అయితే మరీనూ... అలాంటి నాన్న హఠాత్తుగా చనిపోవడంతో నేను షాక్‌లోకి వెళ్లిపోయాను. అంతా శూన్యంలా అనిపించింది. అలా కొన్ని సంవత్సరాలు సినిమాలకి దూరంగా ఉండిపోయాను. ఈ క్రమంలోపెళ్లి చేసుకోవాలన్న ఆలోచన కూడా రాలేదు. ప్రస్తుతం పెళ్లి గురించి కూడా పెద్దగా ఆలోచన లేదు. భవిష్యత్తులో ఆలోచన వస్తే మాత్రం తప్పకుండా చేసుకుంటాను" అని ఆమె చెప్పుకొచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story