chiranjeevi : చిరుకు 'మెగాస్టార్‌' అనే బిరుదు ఎలా వచ్చింది.. ఎవరిచ్చారు?

chiranjeevi : చిరుకు మెగాస్టార్‌ అనే బిరుదు ఎలా వచ్చింది.. ఎవరిచ్చారు?
స్వయంకృషితో సినిమాల్లోకి అడుగుపెట్టి ఒక్కోమెట్టుతో వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ సుప్రీంహీరో నుంచి మెగాస్టార్‌‌గా ఎదిగారు నటుడు చిరంజీవి.

స్వయంకృషితో సినిమాల్లోకి అడుగుపెట్టి ఒక్కోమెట్టుతో వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ సుప్రీంహీరో నుంచి మెగాస్టార్‌‌గా ఎదిగారు నటుడు చిరంజీవి. నటనలోనే కాదు డాన్స్‌‌లో కూడా మెగాస్టార్ స్టైల్ వేరు.. ఇప్పటికీ ఆ స్టైల్‌‌ని ఎవ్వరు కూడా బీట్ చేయడం లేదంటే అర్ధం చేసుకోవచ్చు ఆయన ఏంటో. 60 ఏళ్ల వయసులో కూడా హీరోగా ఇప్పటికి యంగ్ హీరోలకి పోటీ ఇస్తున్నారాయన.. ఇదిలా ఉంటే అభిమానులంతా మెగాస్టార్‌ మెగాస్టార్‌ అంటూ ఆప్యాయంగా పిలుచుకునే చిరుకి ఈ బిరుదు ఎలా వచ్చింది. ఆయనకి ఎవరిచ్చారు?

ఎన్టీఆర్, ఏఎన్నార్,కృష్ణ లాంటి హీరోలు స్టార్ లుగా ఎదుగుతున్న సమయంలో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు చిరంజీవి. తొలుత సహానటుడిగా, ఆ తర్వాత విలన్‌‌‌గా, ఆ తర్వాత హీరోగా మారారు. చిరంజీవిని హీరోగా పెట్టి పలు సూపర్‌‌హిట్ చిత్రాలను నిర్మించారు నిర్మాత కేఎస్‌. రామారావు. వీరి కాంబినేషన్‌‌లో వచ్చిన మొదటి చిత్రం 'అభిలాష. యండమూరి వీరేంద్రనాథ్ నవలా ఆధారంగా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ ని అందుకుంది.

ఆ తర్వాత 'ఛాలెంజ్' 'రాక్షసుడు' చిత్రాలు వీరి కాంబినేషన్‌‌ లో వచ్చాయి. ఇక వీరి కలయికలో వచ్చిన నాలుగవ చిత్రం 'మరణ మృదంగం'. యండమూరి వీరేంద్రనాథ్ నవలా ఆధారంగా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. అయితే అప్పటివరకు చిరంజీవి నటించిన సినిమాలకి సుప్రీంహీరో అనే టైటిల్స్ పడేవి కానీ.. ఈ సినిమాతో సుప్రీంహీరోకి బదులుగా మెగాస్టార్‌ చిరంజీవిగా మారింది.

మెగాస్టార్‌ చిరంజీవి అని రావడంతో థియేటర్‌‌‌లో అంతా అభిమానుల ఈళలతో మారుమోగిందట. ఈ సినిమాతో నిర్మాత కేఎస్‌ రామారావు చిరంజీవికి మెగాస్టార్ అనే బిరుదుని అందించారు. ఇక అప్పటినుంచి అభిమానులు చిరంజీవిని మెగాస్టార్ అని పిలవడం మొదలుపెట్టారు.

Tags

Read MoreRead Less
Next Story