1 Aug 2021 12:00 PM GMT

Home
 / 
సినిమా / టాలీవుడ్ / ఆ సద్విమర్శే .. చిరుని...

ఆ సద్విమర్శే .. చిరుని గొప్ప డాన్సర్‌‌ని చేసింది...!

మెగాస్టార్ చిరంజీవి డాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆరు పదుల వయసులో కూడా ఆయన ఇంకా డాన్స్ ఇరగదీస్తున్నారు.

ఆ సద్విమర్శే .. చిరుని గొప్ప డాన్సర్‌‌ని చేసింది...!
X

మెగాస్టార్ చిరంజీవి డాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆరు పదుల వయసులో కూడా ఆయన ఇంకా డాన్స్ ఇరగదీస్తున్నారు. డాన్స్ అంటే కాళ్ళు చేతులు ఉపేయడం కాకుండా అందులో ఓ స్టైల్‌‌ని మైంటైన్ చేస్తుంటారయన.. అందుకే చిరు డాన్స్‌‌కి అంత ప్రత్యేకత ఉంది. అయితే చిరు డాన్స్‌‌ని అందరూ మెచ్చుకుంటే ఒకరు మాత్రం విమర్శించారట.

చిరంజీవి హీరోగా నటిస్తున్న 5వ సినిమానో 6వ సినిమానో షూటింగ్ జరుగుతుంది. అందులో ఓ పాటకి చిరంజీవి డాన్స్ చేశారు. సెట్లో అది చూసిన చాలామంది క్లాప్స్ కొట్టారు. కానీ ఆ సినిమాకి మేనేజరుగా పనిచేసిన వెంకన్నబాబు మాత్రం అందులో ఏముంది? నీ వెనక ఉన్న డ్యాన్సర్లు ఏం చేశారో, నువ్వూ అదే చేశావు. ఇందులో నీ ప్రత్యేకత ఏముందని అన్నారట.

ఈ మాట చిరంజీవిని ఆలోచనలో పడేసిందట.. డ్యాన్సు మాస్టర్లు చెప్పింది చేయడమే కాదు దానికి అదనంగా ఇంకేదో చెయ్యాలని చిరు అప్పుడు అనుకున్నారట. ఆ తరవాత సినిమా నుంచి పాటను ఆస్వాదిస్తూ చిరు డాన్స్ నేర్చుకునేవారట. అలా సద్విమర్శని స్వీకరించి దానిని నుంచి ఎంతో నేర్చుకొని చాలా మందికి స్పూర్తిగా నిలిచారు చిరంజీవి.

ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' సినిమా చేస్తున్నారు చిరు.. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. రామ్‌ చరణ్‌, పూజా హెగ్డే కీలక పాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతోపాటు మలయాళీ చిత్రం 'లూసిఫర్‌' రీమేక్‌ని చేస్తున్నారు చిరు.

Next Story