Prakash Raj ATMA : ప్రకాష్ రాజ్ 'ఆత్మ'.. దీని వెనుకున్న అర్ధం ఏంటి?

Prakash raj ATMA : 'మా'లో ఎన్నికలతో మొదలైన లొల్లి ఇప్పుడు ఆ అసోసియేషన్ చీలిక వరకు తీసుకెళ్తోంది. మా ఎన్నికల్లో ఎగసిపడిన ప్రాంతీయ నినాదం అసోసియేషన్‌లో చిచ్చు రాజేసింది.. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ చీలిక దిశగా వెళ్తోందనే ప్రచారం జోరందుకుంటోంది.. నిన్న మా ఎన్నికల్లో పోటీ చేసిన ప్రకాష్ రాజ్ టీమ్ ఇవాళ సభ్యత్వాలకు రాజీనామా చేసేందుకు సిద్ధమవడం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.. వీళ్లంతా మా నుంచి బయటికొచ్చి వేరుకుంపటి పెట్టుకుంటారనే ప్రచారం టాలీవుడ్ వర్గాల్లో జరుగుతోంది..
మా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిన ప్రకాశ్‌రాజ్.. కొత్త కుంపటి ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆల్ తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్.. ఆత్మ పేరుతో కొత్త సంఘం దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. కొత్త సంఘంలో ఈసీ మెంబర్లుగా మా ఎన్నికల్లో ఎన్నికైన ప్రకాశ్‌రాజ్ ప్యానల్‌లోని సభ్యులు ఉంటారని తెలుస్తోంది. గౌరవాధ్యక్షులుగా కొందరు సీనియర్లు ఉంటారని.. కొత్త సంఘానికి కన్వీనర్‌గా శ్రీకాంత్ ఉంటారని తెలుస్తోంది. కాసేపట్లో ప్రెస్‌మీట్ పెడుతున్న ప్రకాశ్‌రాజ్.. ఏం మాట్లాడుతారనేది టాలీవుడ్‌లో ఉత్కంఠ నెలకొంది.
కాగా ఆత్మ అనే పేరు ఎందుకు పెట్టారంటే.. వీరి ఇంగ్లీష్ పేరులోని ప్రతీ పదంలో తొలి అక్షరాన్ని కలిపితే ఆత్మ అని వస్తుంది. ఇక తాము కూడా ఆత్మసాక్షిగా పనిచేస్తామన్నట్టుగా ఉంటుదని ప్రకాశ్ రాజ్ వర్గం ఫీలింగ్. అందుకే ఈ పేరును పెట్టారని ఫిలింనగర్ టాక్
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com