నాగార్జున చిన్న సలహా.. స్టార్ డైరెక్టర్‌‌ గా మారిన శ్రీనువైట్ల..!

నాగార్జున చిన్న సలహా..  స్టార్ డైరెక్టర్‌‌ గా మారిన శ్రీనువైట్ల..!
శ్రీనువైట్ల.. మొన్నటివరకు టాలీవుడ్‌‌లో టాప్ మోస్ట్ డైరెక్టర్ లలో ఈయన ఒకరు.. శ్రీనువైట్ల నుంచి సినిమా వస్తుందంటే ఆడియన్స్ ఎక్కువగా ఊహించేంది కామెడీనే..

శ్రీనువైట్ల.. మొన్నటివరకు టాలీవుడ్‌‌లో టాప్ మోస్ట్ డైరెక్టర్ లలో ఈయన ఒకరు.. శ్రీనువైట్ల నుంచి సినిమా వస్తుందంటే ఆడియన్స్ ఎక్కువగా ఊహించేంది కామెడీనే.. శ్రీనువైట్ల సినిమాలలో మందు కొట్టి కామెడీ చేయడం కచ్చితంగా ఉంటుంది. సినిమాకి అదే పెద్ద హైలెట్ గా నిలుస్తుంది కూడా.. ఆయన సినిమాలను ఎక్కువగా చూసే వారికి ఇది పక్కాగా తెలుస్తుంది కూడా.. అయితే కామెడీని ఇంత బాగా తీసే శ్రీనువైట్లకి ముందునుంచి కామెడీ పైన మంచి పట్టుందని అనుకుంటారు ప్రేక్షకులు.. కానీ దర్శకుడు కాకముందు లవ్ స్టోరీస్, యాక్షన్ స్టోరీస్ లతో శ్రీనువైట్ల సినిమా ప్రయత్నాలు చేశారు.

అలా రవితేజతో నీకోసం అనే లవ్ అండ్ యాక్షన్ మూవీ చేశారు శ్రీనువైట్ల..ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందించలేకపోయింది.. కానీ ఈ సినిమా స్టార్ హీరో నాగార్జునని మాత్రం బాగా ఆకట్టుకుంది. వెంటనే శ్రీనువైట్లని పిలిచి సినిమా బాగా తీశావని కానీ మధ్యమధ్యలో కామెడీ ఉంటే ఇంకా బాగుండేదని చెప్పారట. ఇక పై నీ సినిమాల్లో కామెడీ ఉండేలా చూసుకో అని సలహా ఇచ్చారట. స్టార్ హీరో పిలిచి మరి సలహా ఇవ్వడంతో తన మొదటి సినిమాలో ఏది మిస్సైందో దానికే పెద్ద పీట వేశాడు శ్రీనువైట్ల.

తన రెండో సినిమా ఆనందంలో కథతో పాటుగా కామెడీని కూడా అంతే స్థాయిలో ప్రెజెంట్ చేశాడు. ఇది సక్సెస్ అవ్వడంతో దానినే తన సక్సెస్ మంత్రంగా మార్చుకున్నాడు శ్రీనువైట్ల. కాగా శ్రీనువైట్ల, నాగార్జున కాంబినేషన్ లో వచ్చిన కింగ్ మూవీ ప్రేక్షకులను బాగా అలరించింది.

Tags

Read MoreRead Less
Next Story