10 లక్షలు డొనేషన్ ఇచ్చిన బిగ్‌బాస్ సోహైల్!

మనం సంపాదించే దానిలో కొంత భాగాన్ని సేవ చేస్తే దానివలన వచ్చే కిక్కే వేరని అంటున్నారు బిగ్‌బాస్ ఫేం సయ్యద్ సోహైల్.. బిగ్ బాస్ హౌస్ నుంచి వీడే ముందు.. వచ్చిన డబ్బులో కొంత భాగాన్ని అనాథాశ్రమాలకు ఖర్చు చేస్తానని సోహైల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అన్నట్టుగానే వివిధ స్వచ్ఛంద సంస్థలతోపాటు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఓ కుటుంబానికి రూ.10 లక్షలు అందించారు.
అంతేకాకుండా ఇకపై తాను నటించబోయే సినిమాల నుంచి వచ్చే పారితోషికంలో 10 నుంచి 15 శాతం సేవకు వినియోగిస్తానని సోహైల్ చెప్పుకొచ్చాడు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో రూ.10లక్షలను చెక్కును వివిధ స్వచ్ఛంద సంస్థలతోపాటు ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్న మహ్మద్ మొయినుద్దీన్ కుటుంబానికి పంచారు సోహైల్. అనంతరం అక్కడే కాసేపు గడిపారు.
ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చాక సోహైల్ కి వరుస ఆఫర్స్ వస్తున్నాయి. ఇప్పటికే బ్రహ్మానందం, చిరంజీవి లాంటి వాళ్ళు ఎలాంటి రెమ్యునరేషన్ లేకుండా గెస్ట్ రోల్ చేస్తామని ఆఫర్స్ ఇచ్చేశారు. అటు సోహైల్ సోలో హీరోగా కూడా సినిమా ఆఫర్స్ వస్తున్నాయి. త్వరలోనే కొన్ని సినిమాలు పట్టలేక్కనున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com