Krithi Shetty : 'ఉప్పెన' బ్యూటీకి కింగ్ నాగార్జున బంపర్ ఆఫర్!
![Krithi Shetty : ఉప్పెన బ్యూటీకి కింగ్ నాగార్జున బంపర్ ఆఫర్! Krithi Shetty : ఉప్పెన బ్యూటీకి కింగ్ నాగార్జున బంపర్ ఆఫర్!](https://www.tv5news.in/h-upload/2021/07/11/509400-nag.webp)
చేసిన మొదటి సినిమాతోనే ఆడియన్స్‌ని మేస్మైరైజ్ చేసింది ఉప్పెన భామ కృతిశెట్టి. దీంతో టాప్ స్టార్స్ మొదలుకొని స్టార్ డైరెక్టర్ల చూపు ఇప్పుడు ఈ అమ్మాయి పైన పడింది. అందులో భాగంగానే కృతిశెట్టి పర్ఫార్మెన్స్ చూసి ఫిదా అయిన కింగ్ నాగార్జున.. ఆమెకు బంపర్ ఆఫర్ ఇచ్చినట్లుగా సోషల్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొడుతుంది. 'సోగ్గాడే చిన్నినాయనా' సీక్వల్‌గా రాబోతున్న 'బంగార్రాజు' మూవీలో కృతిశెట్టిని తీసుకునేందుకు చర్చలు జరుగుతున్నాయట. ఈ సినిమాలో నాగార్జునతో పాటుగా నాగచైతన్య కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. నాగచైతన్య జంటగా కృతిశెట్టి తీసుకుంటే బాగుంటుందని నాగార్జున భావిస్తున్నాడట. ఇప్పటికే ఈ రోల్ కోసం కొందరు హీరోయిన్లను పరిశీలించిన టీమ్.. నాగార్జున సూచన మేరకు కృతిశెట్టి వైపు మొగ్గు చూపుతున్నారట. త్వరలోనే దీనికి సంబంధించిన ఆఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది. కాగా కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని నాగార్జునే స్వయంగా అన్నపూర్ణ బ్యానర్ పైన నిర్మిస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com