బిగ్‌బాస్‌లో మూడో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్ ఎవరంటే ?

బిగ్‌బాస్‌లో మూడో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్ ఎవరంటే ?

బిగ్ బాస్.. ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో కు భారీ స్థాయిలో ప్రేక్షకాదరణ ఉంది. దేశంలోని దాదాపు అన్ని భాషల్లో వస్తోన్న ఈ షో.. మూడేళ్ల క్రితం తెలుగులోకీ ఎంటరయింది. వచ్చి రావడంతోనే టీఆర్పీ రికార్డులు బ‌ద్ధ‌లు కొట్టి చరిత్ర సృష్టించింది. టాలీవుడ్ లో ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకుని.. మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రోజులు గ‌డిచే కొద్దీ బిగ్‌బాస్ నాలుగో సీజన్ ర‌స‌వ‌త్త‌రంగా మారుతోంది. అయితే ఈ టైంలో ఐపీఎల్ ప్రారంభమైంది. మొన్న‌టివ‌ర‌కు బిగ్‌బాస్‌ను వీక్షించిన‌ వారిలో చాలామంది ఐపీఎల్ రాగానే షోను ప‌క్క‌న‌పెట్టారు. దీంతో ఇప్పటి వరకు ప్రసారం అయిన అన్ని షోలు ఒక లెక్క.. ఇవి ఒక లెక్క అన్నట్లుగా ప్రభావం చూపిస్తోంది. అస‌లే మొద‌టి ఎపిసోడ్‌తో టీఆర్పీ రికార్డులు బ‌ద్ధ‌లు కొట్టిన బిగ్‌బాస్ దాన్ని కాపాడుకునేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో మూడో వైల్డ్ కార్డ్ ఎంట్రీ గురించి బిగ్ బాస్ వేసిన ఓ మాస్టర్ ప్లాన్ లీకైంది.

ఇప్పటికే తొలి రెండు వారాల్లోనే రెండు వైల్డ్ కార్డ్ ఎంట్రీల‌ను ప్ర‌వేశ‌పెట్టింది. ఇప్పుడు ఐపీఎల్‌ను ఢీ కొట్టేందుకు ముచ్చ‌ట‌గా మూడో వైల్డ్ కార్డ్ ఎంట్రీని లోనికి పంపించాల‌ని ఆలోచిస్తోంది. ఈ సారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా జంప్ జిలానీ మూవీ హీరోయిన్‌ స్వాతి దీక్షిత్ ని షోలోకి పంపించనున్నారట. ఇప్ప‌టికే కుమార్ సాయి, అవినాష్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ ఇద్ద‌రిలో అవినాష్ అంద‌రితో కలిసిపోయిన‌ప్ప‌టికీ కుమార్ మాత్రం ఇంకా పొరుగింటి అబ్బాయిగానే ఉంటున్నాడు.

Tags

Read MoreRead Less
Next Story