షాకింగ్‌ న్యూస్‌.. బిగ్‌ బాస్‌కి నాగార్జున గుడ్ బై..!!

షాకింగ్‌ న్యూస్‌.. బిగ్‌ బాస్‌కి నాగార్జున గుడ్ బై..!!
ఐపీఎల్ కారణంగా ఈసారి బిగ్ బాస్ పై అస‌క్తి చూపటం లేదని.. ఇలాంటి సమయంలో నాగ్ కూడా వెళ్లిపోతే.. షో పరిస్థితి ఎలా ఉంటుందో..

లవ్‌స్టోరీలు.. అర్థరాత్రి రొమాన్సులు.. బిగ్‌బాస్4లో కావాల్సినంత కంటెంట్. హగ్గులు, ఆర్గ్యుమెంట్లు.. ఆసక్తికరమైన టాస్కులు. ఇలా బిగ్ బాష్.. షో బుల్లితెర అభిమానులను ఎంటర్‌టైన్ చేస్తు వస్తుంది. ఇక వారాంతంలో వచ్చే కింగ్ నాగార్జున కోసం బుల్లితెర అభిమానులు ఎగ్జయిట్‌మెంట్‌గా ఎదురుచూస్తూంటారు. బిగ్‌ బాస్‌ సీజన్‌ 3 హోస్ట్‌గా మెప్పించిన నాగార్జున.. తన టైమింగ్‌ పంచ్‌లు, వాక్చాతుర్యంతో బిగ్‌ బాస్‌ సీజన్‌ 4ని అదరగొడుతున్నారు.

ప్రస్తుతం బిగ్‌బాస్ సీజన్ 4 నాలుగు వారాలు పూర్తి చేసుకొని ఐదో వారంలోకి అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో ఓ షాకింగ్‌ న్యూస్‌ సోషల్‌ మీడియాలో హల్ చల్ చేస్తోంది. కొన్ని రోజుల పాటు నాగార్జున బిగ్‌ బాస్‌ షోకి దూరంగా ఉండనున్నారట. దానికి కారణంగా 'వైల్డ్‌ డాగ్‌ మూవీ' అని సోషల్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

సోలోమన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'వైల్డ్ డాగ్' మూవీలో నాగార్జున నటిస్తున్నారు. త్వ‌ర‌లో థాయ్ లాండ్‌లో కీల‌క‌మైన షెడ్యూల్ జరగనుంది. క‌నీసం 20 రోజుల పాటు.. ఈ మూవీ షూటింగ్ సాగ‌నుంద‌ట‌. అంటే ఈ 20 రోజులూ బిగ్ బాస్ కి నాగ్‌ గుడ్ బై చెప్పనున్నాడు. శని, ఆది వారాల్లోనే బిగ్ బాష్ లో నాగార్జున క‌నిపిస్తాడు. అంటే దాదాపు 6 ఎపిసోడ్ల‌లో నాగార్జున క‌నిపించ‌డని వార్తలు వస్తున్నాయి.

ఐపీఎల్ కారణంగా ఈసారి బిగ్ బాస్ పై అస‌క్తి చూపటం లేదని.. ఇలాంటి సమయంలో నాగ్ కూడా వెళ్లిపోతే.. షో పరిస్థితి ఎలా ఉంటుందో అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. నాగ్ లేని ఎపిసోడ్ల‌ని ఎవ‌రితో భ‌ర్తీ చేయాలి? అనే విష‌యంలో బిగ్ బాస్ నిర్వాహ‌కులు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డుతున్నారట.

Tags

Read MoreRead Less
Next Story