సోనూజీ మోనల్ కోసం.. : ఫ్యాన్స్ రిక్వెస్ట్
ఆమె ప్రతి వారం ఎలిమినేట్ జోన్‌లో ఉన్నా ప్రేక్షకులు గెలిపిస్తున్నారు అంటూ బిగ్ బాస్ చెప్పడం నిజమో అబద్దమో తెలియదు..

తెలుగు భాష రాని అమ్మాయి మోనాల్ గజ్జర్‌ని తెలుగు బిగ్‌బాస్ హౌస్‌లోకి తీసుకున్నారు.. వచ్చిన కొత్తలోనే కదిలిస్తే కన్నీళ్లు అని ముద్ర వేసుకుంది.. ఆమె మాట్లాడే హిందీ, ఇంగ్లీషు సగటు ప్రేక్షకుడికి అర్ధం కాక తల పట్టుకుంటున్నాడు.. ఇక ఆమె పగలు అఖిల్‌తో, రాత్రి అభిజిత్‌తో చేసే చిట్ చాట్.. అంతకు మించి చేసే వాటిని కూడా కుటుంబ ప్రేక్షకులు జీర్ణించుకోలేక పోతున్నారు.. ఆమె డ్రస్సింగ్ తీరుని కూడా తప్పు పడుతున్నారు.. ఇలా మైనస్‌లు ఎన్ని ఉన్నా ఆశ్చర్యంగా ఆమె ప్రతి వారం ఎలిమినేట్ జోన్‌లో ఉన్నా ప్రేక్షకులు గెలిపిస్తున్నారు అంటూ బిగ్ బాస్ చెప్పడం నిజమో అబద్దమో తెలియదు.. అయితే ఒక వర్గం ప్రేక్షకులు ఇలా ఉన్నా..
మరో వైపు మోనల్‌కి సపోర్ట్ చేసే వాళ్లూ ఉన్నారు.. తెలుగు రాకపోయినా మాట్లాడడానికి ట్రై చేస్తోందంటున్నారు.. ఇక అఖిల్, మోనాల్ స్నేహాన్ని ఎందుకు భూతద్దంలో చూస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయాన్ని అందరికీ ఆప్తుడిగా మారిన సోనూ సూద్ దగ్గర ప్రస్తావిస్తూ.. మోనల్‌కి సాయం చేయండి.. ఆమెకు మద్దతు తెలపండి.. సోనూ జీ అంటూ సోనూ, మోనల్ కలిసి దిగిన ఫోటోలను షేర్ చేశారు. ఇదివరకే మీకు మోనల్ పరిచయం ఉంటే తనను దుష్ప్రచారం నుంచి కాపాడండి.. వేరే రాష్ట్రం నుంచి వచ్చిందని ఆమెకు సపోర్ట్ చేయనవసరం లేదని వివక్షచూపుతున్నారు.. ప్లీజ్ సర్.. మీరైనా ఆమెకు సపోర్ట్ చేయండి అంటూ సోనూ సూద్‌ని రిక్వస్ట్ చేస్తున్నారు.
RELATED STORIES
DJ Tillu 2: 'డీజే టిల్లు' సీక్వెల్.. నేహా శెట్టి ప్లేస్‌లో మలయాళ...
13 Aug 2022 4:23 PM GMTChiru Pawan: మెగా బ్రదర్స్ పుట్టినరోజులకు ఫ్యాన్స్‌కు స్పెషల్...
13 Aug 2022 3:30 PM GMTAllu Arjun: అల్లు అర్జున్ గ్యారేజ్‌లోకి కొత్త కారు.. ధర ఎంతంటే..?
13 Aug 2022 2:15 PM GMTMohanlal: ఆ హిట్ సినిమాకు సీక్వెల్.. ఫస్ట్ లుక్ రిలీజ్..
13 Aug 2022 1:46 PM GMTProducers Guild: నాని, నితిన్‌లను లెక్క చేయని "ప్రొడ్యూసర్స్...
13 Aug 2022 1:00 PM GMTTamannaah: రజినీకాంత్ సరసన తమన్నా.. ఆ సీనియర్ హీరోయిన్‌తో పాటు..
13 Aug 2022 12:25 PM GMT