వైభవంగా నటరాజ్‌ మాస్టర్‌ భార్య నీతూ సీమంతం.. !

వైభవంగా నటరాజ్‌ మాస్టర్‌ భార్య నీతూ సీమంతం.. !
బిగ్‌‌బాస్ సీజన్ 5 చూసేవారికి నటరాజ్ మాస్టర్ అంటే తెలియకుండా ఉండదు.. హౌజ్ లోకి 12వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చారు నటరాజ్‌ మాస్టర్‌..

బిగ్‌‌బాస్ సీజన్ 5 చూసేవారికి నటరాజ్ మాస్టర్ అంటే తెలియకుండా ఉండదు.. హౌజ్ లోకి 12వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చారు నటరాజ్‌ మాస్టర్‌.. ఇదిలావుండగా తాజాగా ఆయన భార్య నీతూ సీమంతం జరిగింది. అం కుటుంబ సభ్యులు ఎంతో ఘనంగా ఈ వేడుకని జరిపారు. ఈ ఫంక్షన్‌కి బుల్లితెర తారలు.. నవీన, శ్రీవాణి,అంజలి పవన్‌, జ్యోతి రెడ్డి తదితరులు వచ్చి సందడి చేశారు. కాగా తన భార్య ఏడు నెలల గర్భంతో ఉన్న సయమంలో ఆమెను వదిలేసి బిగ్‌బాస్‌ షోలోకి వచ్చారు నటరాజ్ మాస్టర్.

ముందుగా షోలోకి వెళ్లేందుకు ఇష్టం లేకపోయిన తన భార్య నీతూ ఫోర్స్‌తోనే బిగ్‌‌బాస్ లోకి వెళ్తున్నట్లుగా నటరాజ్ మాస్టర్ వెల్లడించాడు. తన బిడ్డ లోకంలోకి రాగానే తన చూడలేకపోవచ్చు... కానీ బిగ్‌బాస్‌ ట్రోఫీ గెలిచి ఇంటికి వెళ్తానని చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. కాగా నీతూ సీమంతానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కృష్ణా జిల్లాకు చెందిన నటరాజ్‌ మాస్టర్‌ ఇండస్ట్రీలోని టాప్ హీరోలందరితో కలిసి పనిచేశారు. 2009లో తన శిష్యురాలు నీతూని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story