Bigg Boss 5 Sarayu Roy : తగ్గేదే.. లే... నేను వర్జిన్ కాదు.. పీటల వరకు వచ్చిన పెళ్లి క్యాన్సల్..!

Bigg Boss 5 Sarayu Roy : తగ్గేదే.. లే... నేను వర్జిన్ కాదు.. పీటల వరకు వచ్చిన పెళ్లి క్యాన్సల్..!
X
Bigg Boss 5 Sarayu Roy :సరయి.. పెద్దగా పరిచయం అక్కర్లేదు.. బోల్డ్‌‌గా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే బ్యూటీగా ఆల్రెడీ పేరున్న సరయి.. బిగ్‌‌బాస్ 5 షో ద్వారా మరింత పాపులారిటీని సంపాదించుకుంది.

Bigg Boss Sarayu Roy :సరయి.. పెద్దగా పరిచయం అక్కర్లేదు.. బోల్డ్‌‌గా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే బ్యూటీగా ఆల్రెడీ పేరున్న సరయి.. బిగ్‌‌బాస్ 5 షో ద్వారా మరింత పాపులారిటీని సంపాదించుకుంది. ఎన్నో అంచనాలతో హౌజ్ లోకి వెళ్ళిన సరయు.. మొదటి వీక్ లోనే బయటకు వచ్చింది. ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూలతో బిజీబిజీగా గడిపేస్తుంది. ఈ అమ్ముడు.

ఏదైనా బోల్డ్‌‌గా మాట్లాడే సరయి తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను పంచుకుంది. తానూ ఓ వ్యక్తితో ఏడేళ్ళు రిలేషన్‌లో ఉన్నానని, అతడే సర్వం అనుకున్నానని.. పెళ్లి చేసుకుందామని అనుకున్నామని చెప్పుకొచ్చింది. అయితే.. కట్నం దగ్గర గొడవ రావడంతో పీటల వరకు వచ్చిన పెళ్లి క్యాన్సల్ అయిందని తెలిపింది.

అబ్బాయి తల్లిదండ్రులు ముందుగా 25 లక్షల కట్నం మొదలుపెట్టి కోటి రూపాయల వరకు వెళ్లారని, చివరికి ఆస్తిలో సగభాగం కూడా అడిగేశారని తెలిపింది. పెళ్ళికి ముందే ఇలా ఉంటే.. పెళ్లయ్యాక పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకొనే ఆ పెళ్లి వద్దనుకున్నానని చెప్పింది.

లైఫ్ లో ఇలాంటివి ఎన్ని దెబ్బలు వచ్చిన ఎదిగి చూపిస్తానని.. ఆ విషయంలో తగ్గేది లేదు అంటూ తెలిపింది. ఇక తాను వర్జిన్ కాదంటూ బోల్డ్ గానే ఆన్సర్ ఇచ్చింది. ఇక తన మెంటాలిటీకి తగ్గట్టుగా ఉన్న వ్యక్తినే పెళ్లి చేసుకుంటానని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ.

Tags

Next Story